https://oktelugu.com/

Vaishnavi Chaitanya: తన భర్తలో ఉండాల్సిన క్వాలిటీస్ చెప్పేసిన వైష్ణవి చైతన్య.

ముఖ్యంగా బేబీ సినిమా అంతా కూడా వైష్ణవి చైతన్య చుట్టూనే తిరుగుడం తనకు మంచి పేరు తీసుకొచ్చింది. సాయి రాజేష్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాని ఎస్కేయన్ నిర్మించగా ఈ సినిమాలో ఆనంద్ దేవరకొండ, విరాజ్ హీరోలగా నటించారు.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : September 12, 2023 / 04:36 PM IST

    Vaishnavi Chaitanya

    Follow us on

    Vaishnavi Chaitanya: యూట్యూబ్ లో సాఫ్ట్వేర్ డెవలపర్ అనే వెబ్ సిరీస్ ద్వారా ఫేమస్ అయిన వైష్ణవి చైతన్య బేబీ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. ఈ సంవత్సరం తక్కువ బడ్జెట్ తో వచ్చి బ్లాక్ బస్టర్ విజయం సాధించింది ఈ సినిమా.

    ముఖ్యంగా బేబీ సినిమా అంతా కూడా వైష్ణవి చైతన్య చుట్టూనే తిరుగుడం తనకు మంచి పేరు తీసుకొచ్చింది. సాయి రాజేష్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాని ఎస్కేయన్ నిర్మించగా ఈ సినిమాలో ఆనంద్ దేవరకొండ, విరాజ్ హీరోలగా నటించారు.

    ఇక ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయంతో ఈ హీరోయిన్ కి వరసగా ఆఫర్లు వస్తున్నాయి. ముఖ్యంగా బేబీ సినిమాతో యూత్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది వైష్ణవి చైతన్య. కాగా కొద్ది రోజుల క్రితం ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వైష్ణవి తన భర్తలో ఉండాల్సిన క్వాలిటీస్ చెప్పకు వచ్చింది. ఇక ఇప్పుడు బేబీ సినిమాతో ఈ హీరోయిన్ సెన్సేషన్ క్రియేట్ చేస్తూ ఉండడంతో ఆ వీడియో వైరల్ అవుతోంది.

    వైష్ణవి చైతన్య ఆ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..’ నాకు కాబోయే భర్త పై భారీ అంచనాలు ఏమీ పెట్టుకోవడం లేదు. ఆస్తిపాస్తులు ఏమీ లేకున్నా,అందచందమేమీ లేకపోయినా నాకు పరవాలేదు. మంచి మనసు ఉంటే చాలు’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ భామ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..