https://oktelugu.com/

India-Saudi Arabia : పాకిస్తాన్ గొంతులో పచ్చి వెలక్కాయ, భారత్ సౌదీ అరేబియా సన్నిహిత సంబంధాలు

మన దేశంలో సౌదీ పెట్టుబడులతో పాకిస్తాన్ గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్టైంది. భారత్ సౌదీ అరేబియా సన్నిహిత సంబంధాలపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

Written By:
  • NARESH
  • , Updated On : September 12, 2023 / 04:34 PM IST

    India-Saudi Arabia : రెండు రోజుల జీ20 సమావేశాల్లో ఎన్నో ఫలితాలు వచ్చాయి. సమావేశాలే చరిత్ర. ముఖ్యంగా మిడిల్ ఈస్ట్, యూరప్ ఎకనామిక్ కారిడార్ అనేది ప్రపంచానికే గేమ్ ఛేంజర్ గా చెప్పొచ్చు. వాస్కోడిగామా సౌతాఫ్రికా చుట్టూ తిరిగి వచ్చినట్టుగానే అత్యంత దూరం రూట్ గా దాన్ని పిలుస్తారు. ఇప్పుడు యూరప్ కు అత్యంత దగ్గర రూట్ ను కనుగొన్నారు. ఈ మేరకు ఒప్పందం కుదిరింది.

    అమెరికా, భారత్ చర్చల్లో కూడా ఒప్పందాలు చాలా వాటిని మెటీరియల్ చేసుకొని అమలు చేశారు. నిన్న కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. సౌదీ అరేబియాతో ద్వైపాక్షిక ఒప్పందాన్ని మోడీ సర్కార్ చేసుకుంది. 8.7 జీడీపీతో దూసుకుపోతోంది. సౌదీ అరేబియా బిగ్గెస్ట్ ఎకానమీ. దాంతో మొత్తం 8 ఒప్పందాలు చేసుకుంది మోడీ సర్కార్. 47 ఎంవోయూలు సంతకం చేశారు. ఆయిల్, పెట్రోల్, సెమీ కండక్టర్స్, డిఫెన్స్, స్పేస్, అండర్ గ్రౌండ్ వాటర్ గ్రిడ్, పవర్ గ్రిడ్ వేస్తున్నారు. దాంతోపాటు 100 బిలియన్ డాలర్ల పెట్టుబడులు తీసుకొచ్చారు. 8.30 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు భారత్ లో పెట్టనునుంది సౌదీ అరేబియా. ఇందులో సగం ‘రత్నగిరి రిఫైనరీ పెట్రోల్ కెమికల్ లిమిటెడ్’ కంపెనీలో పెడుతారు. సౌదీ, అబుదాబీ కలిపి భారత్ లో లక్షల కోట్ల పెట్టుబడులు పెడుతారు.

    మన దేశంలో సౌదీ పెట్టుబడులతో పాకిస్తాన్ గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్టైంది. భారత్ సౌదీ అరేబియా సన్నిహిత సంబంధాలపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.