క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ సినిమాల్లో ఏదో మ్యాజిక్ ఉంటుంది. గట్టి సందేశంతోపాటు చారిత్రక, సామాజిక విలువలూ బాగానే ఉంటాయి. ఆయన సినిమాను కేవలం రెండు, మూడు నెలల్లోనే తీసేస్తుంటారు. ఎంత పెద్ద సినిమా అయినా సరే. అదే పని చేస్తారు. అయితే తాజాగా కరోనా లాక్ డౌన్ వేళ ఆయన ఒక నవల చదివారు. అదే ‘కొండపొలం’. అది దర్శకుడు క్రిష్ కు బాగా నచ్చింది.దీన్ని రాసింది ‘సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి అనే రచయిత. ఈ నవల బాగా నచ్చడంతో అడిగినంత చెల్లించి హక్కులు తీసుకున్నారు దర్శకుడు క్రిష్. అంతేకాదు.. ఆ రైటర్ పేరును సినిమాల్లో ఇచ్చారు.
ఒకప్పుడు టీవీలు, ఫోన్లు లేనప్పుడు అందరూ పేపర్లు, నవలలు చదువుతూ జ్ఞానాన్ని పెంచుకునే వారు. కానీ ఇప్పుడు కాలం మారింది. ఎవరూ కథలు, నవలలు చదివే రోజులు పోయాయి. ప్రముఖ పబ్లిషర్స్ కూడా కథలు, నవలలు పుస్తకాలు వేయడం లేదు. సో ఎన్నో కథలు, నవలలు కూడా మరుగనపడిపోతున్నాయి. అలాంటి ఓ మంచి కథను ఎంచుకొని క్రిష్ ఈ సినిమాను రూపొందించాడు.
అయితే అమెరికా ప్రవాసులు ‘తానా’ నవలల పోటీ పెట్టి లక్షల్లో బహుమానాలు ఇస్తున్నారు. దీంతో రచయితలు పోటీపడి మంచి నవలలు రాస్తున్నారు. తానా నుంచి వచ్చిన ‘కొండపొలం’ నవల చదివి క్రిష్ స్పూర్తి పొందారు. వెంటనే హక్కులను కొని కేవలం 45 రోజుల్లోనే కరోనా లాక్ డౌన్ వేళ ఈ సినిమాను తీసేశారు.
‘కొండపొలం’ అంటే ఎవరికీ తెలియకపోవచ్చు. నల్లమల్ల అటవీ ప్రాంతంలో నివసించే ప్రజలు నిత్యం వాడే పదం ఇదీ.. కరువు వచ్చినప్పుడు గొర్రెలకు మేత దొరకదు. దీంతో గొర్రెల మందను మేపుకుంటూ అటవీబాట పడుతారు నల్లమల వాసులు. ఈ ప్రక్రియనే ‘కొండపొలం’ అంటారు. అలా గొర్రెల మందని మేపుకుంటూ అడివికి వెళ్లిన హీరోనే మన వైష్ణవ్ తేజ్. ఈ సినిమాలో ‘కటారు రవీంద్ర యాదవ్’ అనే పాత్రలో మెగా మేనల్లుడు కనిపించనున్నాడు.
అలా గొర్రెల మందని మేపుకుంటూ అడివికెళ్లిన హీరోకు ఎదురైన అనుభవాల సమాహారమే ఈ చిత్రం. అడవిలో భయంకరమైన దుర్మార్గాలను హీరో ఎదుర్కొన్నది ఆసక్తికరంగా చూపించారు. ఈ సినిమాకు విజువల్ ఎఫెక్ట్ యే 80శాతం ఉంటుందట.. బ్యాక్ గ్రౌండ్ స్కోరు కీలకం అందుకే కీరవాణితో సంగీతం అందించాడు క్రిష్.
షూటింగ్ తక్కువగా ఉండి మొత్తం విజువల్ ఎఫెక్ట్ తోనే సినిమా నడుస్తోంది. ఈ సినిమా విజువల్స్ కరెక్ట్ పడితే ఓ జంగిల్ బుక్ లాంటి సినిమా అవుతుందట.. అందుకే సినిమా మేకింగ్ కు క్రిష్ చాలా సమయం కేటాయించాడు. రెండు నెలల్లో షూటింగ్ పూర్తి చేసిన క్రిష్.. పోస్ట్ ప్రొడక్షన్ కు మాత్రం 8 నెలలు కేటాయించారు. విజువల్ ఎఫెక్ట్ బాగా వస్తేనే ఈ సినిమా ఆడుతుందని రీషూట్ కూడా చేశారట.. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో ఏమాత్రం రాజీపడడం లేదట క్రిష్. అందుకే ఈ సినిమా లేట్ అవుతుందని అంటున్నారు.