Nagarjuna Bangarraju Movie launched : పూజలో బంగార్రాజు.. చైతుతో పాటు కీర్తి శెట్టి కూడా !

Nagarjuna Bangarraju Movie launched: టాలీవుడ్ మన్మధుడు అక్కినేని నాగార్జున (Nagarjuna) హిట్ సినిమా “సోగ్గాడే చిన్ని నాయ‌న” సీక్వెల్ బంగార్రాజు ( Bangarraju) మొత్తానికి ఈ రోజు స్టార్ట్ అయింది. అన్నపూర్ణ స్టూడియోలో పూజా కార్యక్రమంతో ఈ సినిమా ప్రారంభానికి ముహూర్తం పూర్తి అయింది. కాగా ఈ కార్యక్రమంలో నాగార్జునతో పాటు చైతు, అలాగే కీర్తి శెట్టి కూడా పాల్గొంది. ఇక ఈ సినిమా కోసం ఆర్ట్ డైరెక్టర్ రవీందర్ స్వర్గం సెట్ వేసిన సంగతి […]

Written By: admin, Updated On : August 20, 2021 2:43 pm
Follow us on

Nagarjuna Bangarraju Movie launched: టాలీవుడ్ మన్మధుడు అక్కినేని నాగార్జున (Nagarjuna) హిట్ సినిమా “సోగ్గాడే చిన్ని నాయ‌న” సీక్వెల్ బంగార్రాజు ( Bangarraju) మొత్తానికి ఈ రోజు స్టార్ట్ అయింది. అన్నపూర్ణ స్టూడియోలో పూజా కార్యక్రమంతో ఈ సినిమా ప్రారంభానికి ముహూర్తం పూర్తి అయింది. కాగా ఈ కార్యక్రమంలో నాగార్జునతో పాటు చైతు, అలాగే కీర్తి శెట్టి కూడా పాల్గొంది.

ఇక ఈ సినిమా కోసం ఆర్ట్ డైరెక్టర్ రవీందర్ స్వర్గం సెట్ వేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా మొదటి షెడ్యూల్ ను ఈ భారీ సెట్ లోనే షూట్ చేయనున్నారు. అన్నట్టు ఈ సినిమా బడ్జెట్ విషయంలో అసలు కాంప్రమైజ్ కావడం లేదు. సహజంగా బడ్జెట్ విషయంలో చాలా కంట్రోల్ లో ఉండే నాగార్జున, ఈ సినిమాకి మాత్రం ఎలాంటి పరిమితులు పెట్టుకోలేదు.

ఈ సినిమా సెట్ కోసమే కోటి రూపాయల బడ్జెట్ ను కేటాయించారు. మొత్తానికి ‘బంగార్రాజు’ కోసం భారీగా ఖర్చు పెడుతున్నారు మేకర్స్. ఫస్ట్ షెడ్యూల్ ఆగస్టు 20 నుంచి మొదలు కానుంది. ఈ షెడ్యూల్ లో నాగార్జునతో పాటు చైతు కూడా షూట్ లో పాల్గొననున్నాడు. అదేవిధంగా రమ్యకృష్ణ కూడా కూడా షూట్ పాల్గొననుంది.

‘మనం’ తర్వాత నాగార్జున – నాగచైతన్య కలిసి నటిస్తున్న చిత్రం ఇదే కావడం విశేషం. వచ్చే సంక్రాంతికి విడుదల చేయడమే లక్ష్యంగా ఈ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు. పైగా ఈ సినిమాలో నాగచైతన్యకి జోడీగా క్రేజీ హీరోయిన్ కృతిశెట్టి నటిస్తోంది. ఎలాగూ ‘సోగ్గాడే చిన్ని నాయన’ భారీ విజయం సాధించింది. కాబట్టి, ఆ సినిమా విజయం కారణంగా ఈ సినిమాకి కూడా మంచి బిజినెస్ జరిగే అవకాశం ఉంది.