Homeఎంటర్టైన్మెంట్Vadde Naveen Career Controversy: వడ్డే నవీన్ కెరియర్ ను తొక్కేసిందెవరు..? నందమూరి ఫ్యామిలీకి తనకి...

Vadde Naveen Career Controversy: వడ్డే నవీన్ కెరియర్ ను తొక్కేసిందెవరు..? నందమూరి ఫ్యామిలీకి తనకి మధ్య గొడవలేంటి..?

Vadde Naveen Career Controversy: సినిమా ఇండస్ట్రీలో చాలామంది స్టార్ హీరోలు చాలా సంవత్సరాల పాటు తమదైన రీతిలో సత్తా చాటుకునే ప్రయత్నం చేస్తుంటారు. వాళ్ళకంటూ ఒక ఫ్యామిలీని ఏర్పాటు చేసుకొని వాళ్ళ కొడుకులు, మనువలను సైతం హీరోలుగా సెటప్ చేసే ప్రాసెస్ లో ఉంటారు. ఇక ఇలాంటి క్రమంలోనే కొత్తగా ఇండస్ట్రీకి వచ్చి ఇక్కడ రానిస్తాం అనుకున్న కొంతమంది హీరోలు కెరియర్ మొదట్లో వరుసగా సక్సెస్ లు రావడంతో మనకంటే తోపు ఎవడు లేడు అనుకొని పెద్ద ఫ్యామిలీలో ఉన్న హీరోలను సైతం గెలకడం, వాళ్ళతో గొడవలు పెట్టుకోవడం లాంటివి చేయడంతో వల్ల స్టార్ హీరోల అభిమానులు ఈ యంగ్ హీరోల సినిమాలను చూడడం మానేస్తున్నారు. దాని వల్ల వాళ్ళ సినిమాలు ఆడక వల్ల సినీ కెరియర్ అర్థంతరంగా ముగిసిపోతుంది… ఇప్పటివరకు చాలామంది యంగ్ హీరోలు అలా చేయడం వల్ల వాళ్ళ కెరియర్ ని కోల్పోయారు. ఇక ఇదిలా ఉంటే ఒకప్పుడు స్టార్ హీరోగా వెలుగొందిన నటుడు వడ్డే నవీన్…

ఆయన సైతం చాలా సంవత్సరాల పాటు సినిమాలు లేకుండా ఖాళీ గా ఉన్నాడు. ఇక ఇప్పుడు ‘ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు’ మూవీతో రీఎంట్రీ ఇస్తున్నాడు. ఒకప్పుడు హీరోగా తన స్టార్ డమ్ ను విస్తరించుకున్న ఆయన ఎన్టీఆర్ కొడుకు అయిన రామకృష్ణ కూతురు చాముండేశ్వరిని పెళ్లి చేసుకున్నాడు. కొద్ది రోజులు వాళ్ళు కలిసి మెలిసి ఉన్నారు.

కానీ ఏమైందో తెలియదు ఆ తర్వాత వాళ్లిద్దరు విడాకులు తీసుకున్నారు. దాంతో నవీన్ డిప్రెషన్ లోకి వెళ్లిపోయి చాలా సంవత్సరాల పాటు సినిమాలు చేయకుండా మానేశారు. ఇక ప్రస్తుతం తను సెకండ్ పెళ్లి చేసుకుని హ్యాపీ లైఫ్ ను లీడ్ చేస్తూ ముందుకు సాగుతున్నాడు. అలాగే సినిమాల పరంగా కూడా సెకండ్ ఇన్నింగ్స్ ను స్టార్ట్ చేశాడు…

నిజానికి వడ్డే నవీన్ విడాకులు తీసుకున్న తర్వాత నందమూరి ఫ్యామిలీ నుంచి అతనికి ఎలాంటి ఇబ్బందులు ఎదురవ్వలేదు. తన సినిమాలు తను చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు కానీ తన మెంటల్ స్టెబిలిటీ సరిగ్గా లేకపోవడం వల్ల ఆయన కొద్ది రోజులపాటు విశ్రాంతి తీసుకున్నానని గతంలో తెలియజేశాడు. మొత్తానికైతే ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు సినిమాతో మరోసారి లైమ్ లైట్ లోకి రావాలనే ప్రయత్నం చేస్తున్నాడు…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version