Ustad Bhagat Singh : రికార్డుల మోత మోగించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’..కేవలం 4 గంటల్లోనే ఆల్ ఇండియా రికార్డ్స్ స్మాష్

#RRR చిత్రం ఈ రికార్డు ని బ్రేక్ చేసింది, ఈ చిత్రం గ్లిమ్స్ వీడియో కి మొదటి 13 నిమిషాల్లో లక్ష కి పైగా లైక్స్ వచ్చాయి, ఇప్పు ఉస్తాద్ భగత్ సింగ్ గ్లిమ్స్ వీడియో కేవలం 12 నిమిషాల్లోనే లక్షకి పైగా లైక్స్ ని సాధించి సరికొత్త చరిత్ర సృష్టించింది.

Written By: NARESH, Updated On : May 11, 2023 10:42 pm

Ustad Bhagat Singh Poster

Follow us on

Ustad Bhagat Singh : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు హరీష్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న రెండవ సినిమా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఇటీవలే రెగ్యులర్ షూటింగ్ ని ప్రారంభించుకొని ఒక షెడ్యూల్ ని పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. కేవలం పది రోజుల షూటింగ్ మాత్రమే జరుపుకున్న ఈ చిత్రానికి అప్పుడే ఎడిటింగ్ వర్క్ కూడా పూర్తి చేసి, గ్లిమ్స్ వీడియో ని విడుదల చేసారు.

ఈ చిన్న షెడ్యూల్ లో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి బోలెడంత ఫ్యాన్స్ స్టఫ్ ని ఇచ్చాడు హరీష్ శంకర్. పవన్ కళ్యాణ్ మార్క్ మ్యానరిజమ్స్,స్వాగ్ మరియు యాటిట్యూడ్ తో గ్లిమ్స్ వీడియో మొత్తాన్ని రఫ్ఫాడించేసారు. సినిమా విడుదల అయ్యేంత వరకు నాన్ స్టాప్ రిపీట్స్ వేసుకునే రేంజ్ స్టఫ్ ఇచ్చాడు. ఇక గ్లిమ్స్ వీడియో కి ఫ్యాన్స్ తో పాటుగా సెలెబ్రిటీలు కూడా కాసేపు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గా మారిపోయారు.

ఒకరి తర్వాత ఒకరు పవర్ స్టార్ మాస్ అంటూ ట్వీట్స్ వెయ్యడం ప్రారంభించారు.ఇక గ్లిమ్స్ వీడియో కి కూడా యూట్యూబ్ లో మంచి రికార్డ్స్ వస్తున్నాయి,గతం లో పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన భీమ్లా నాయక్ గ్లిమ్స్ కి అత్యంత వేగవంతమైన లైక్స్ వచ్చాయి.మొదటి 17 నిమిషాల్లో లక్షకి పైగా లైక్స్ వచ్చాయి.

ఆ తర్వాత #RRR చిత్రం ఈ రికార్డు ని బ్రేక్ చేసింది, ఈ చిత్రం గ్లిమ్స్ వీడియో కి మొదటి 13 నిమిషాల్లో లక్ష కి పైగా లైక్స్ వచ్చాయి, ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ గ్లిమ్స్ వీడియో కేవలం 12 నిమిషాల్లోనే లక్షకి పైగా లైక్స్ ని సాధించి సరికొత్త చరిత్ర సృష్టించింది. అలా నాలుగు గంటలు గడిచిపోయినా తర్వాత ఈ గ్లిమ్స్ వీడియో కి నాలుగు లక్షల లైక్స్ మరియు 7 మిలియన్ కి పైగా వ్యూస్ వచ్చాయి. ఇక 24 గంటలు గడిచిన తర్వాత ఈ గ్లిమ్స్ వీడియో ఇంకెన్ని మైల్ స్టోన్స్ దాటబోతుందో చూడాలి.