Karnataka Elections : బీజేపీ హవాకు దక్షణాది రాష్ట్రం చెక్ చెప్పనుందా? వరుస విజయాలతో దూసుకుపోతున్న కాషాయదళానికి బ్రేక్ పడనుందా? ప్రాంతీయ పార్టీ కబళింపు రాజకీయాలకు కర్నాటక వేదిక కానుందా? అధికారానికి ఆమడదూరంలో ఉండిపోనుందా? హంగ్ అయితే కింగ్ ఎవరు? కింగ్ మేకర్ ఎవరు? ఇప్పుడు యావత్ భారతావనిని తొలుస్తున్న ప్రశ్న ఇది. కర్నాటక ఫలితాలు దేశ రాజకీయాలకు దిక్సూచిగా నిలవనున్నాయి. ఎగ్జిట్ పోల్స్ హంగ్ సంకేతాలతో కర్నాటక రాజకీయం రసకందాయంలో పడింది. శనివారం నాడు వెల్లడయ్యే ఫలితాలపై మరింత అంచనాలు పెరిగాయి.
ఎన్నికల ముందు వరకూ కాంగ్రెస్ పార్టీకి అనుకూల వాతావరణం నడిచింది. బీజేపీకి ప్రతికూల అంశాలు చుట్టుముట్టాయి. కాంగ్రెస్ ఇట్టే మ్యాజిక్ ఫిగర్ ను దాటేస్తుందని అందరూ అంచనా వేశారు. అందుకు తగ్గట్టుగానే గతంలో ఎన్నడూ లేని విధంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఐక్యపోరాటాలతో బీజేపీకి ముచ్చెమటలు పట్టించారు. కానీ పోలింగ్ తరువాత వెలువడిన ఎగ్టిజ్ పోల్స్ లో మాత్రం బీజేపీ, కాంగ్రెస్ లు రమారమి వందకు దగ్గరగా సీట్లు తెచ్చుకుంటాయని చెబుతుండడంతో హంగ్ తప్పదన్న సంకేతాలు వెలువడుతున్నాయి. కాంగ్రెస్, బీజేపీలు సొంతంగా అధికారంలోకి రావడం కష్టమని చెబుతున్నాయి. కానీ లార్జెస్ట్ పార్టీగా కాంగ్రెస్ నిలిచి ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమం చేసుకోనుంది. జేడీఎస్ తో కలిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడం ఖాయంగా కనిపిస్తోంది.
ఇప్పటివరకు ఉన్న అంచనాల ప్రకారం చూస్తే.. జేడీఎస్ కు కనీసం 20 స్థానాల్లో గెలుపొందుతుందని.. అదే జరిగితే ఆ పార్టీ కింగ్ మేకర్ గా మారుతుందంటున్నారు. అయితే.. కింగ్ మేకర్ అవసరం లేదని.. సొంతంగా గెలుస్తామన్న ధీమా కాంగ్రెస్ లో ఎగ్జిట్ పోల్స్ తో వచ్చేసింది.
బీజేపీకి ఎన్నో గుణపాఠాలు నేర్పిన కర్ణాటక ఎన్నికలు.. కర్ణాటకలో బీజేపీ పరిస్థితి పై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.