Ustaad Review: ఓ వైపు పెద్ద సినిమాలు భారీ బడ్జెట్ తో సందడి చేస్తున్న సమయంలో చిన్న సినిమాలు కంటెంట్ ను నమ్ముకొని థియేటర్లకు వస్తున్నాయి. ఇలా వచ్చిన వాటిలో కొన్ని ఓ రేంజ్ లో సక్సెస్ అవుతున్నాయి. ఏమాత్రం ఎక్స్ పెక్ట్ చేయనివి బంపర్ హిట్టు కొడుతున్నాయి. ఇలాంటి తరుణంలో మరో మూవీ తాజాగా ఆగస్టు 12న రిలీజ్ అయింది. అదే ‘ఉస్తాద్’. రాజమౌళి ఫ్యామిలీ నుంచి వచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి రెండో కుమారుడు శ్రీ సింహా హీరోగా నటించిన ఈ మూవీలో ఆయనకు జోడిగా కావ్య నటించింది. ‘మత్తు వదలరా’ అనే సినిమాతో శ్రీ సింహా అందరికీ పరిచయం అయ్యాడు. అయితే ఆ తరువాత తెల్లవారితే గురువారం, దొంగలున్నారు జాగ్రత్త, భాగ్ సాలే వంటి సినిమాల్లో నటించాడు. కానీ అవి సరైన విజయాన్ని అందుకోలేకపోయాయి. హిట్టు, ఫట్టుతో సంబంధం లేకుండా శ్రీ సింహ వరుసగా సినిమాల్లో నటిస్తున్నాడు. తాజాగా ఆయన నటించిన ‘ఉస్తాద్’ ఎలా ఉందో చూద్దాం..
నటీనటులు:
శ్రీ సింహా
కావ్య కల్యాణ్ రామ్
గౌతమ్ వాసుదేవ్ మీనన్
అను హాసన్
రవీంద్ర విజయ్
వెంకటేష్ మహా
రవి శివ తేజ
సాయి కిరణ్
సాంకేతిక కార్యవర్గం:
డైరెక్టర్: ఫణిదీప్
నిర్మాతలు: రజనీ కొర్రపాటి, రాఖేష్ రెడ్డి, హిమాంక్
మ్యూజిక్ అకీవ బీ
ఎడిటర్: కార్తీక్ కట్స్
సినిమాటోగ్రఫీత: పవన్ కుమార్ పప్పుల
కథ:
ఉస్తాద్ ఓ బైక్ స్టోరీ. కానీ దీనికి లవ్ స్టోరీ ముడిపడి ఉంటుంది. సూర్య (శ్రీ సింహ)కు ఎత్తు ప్రదేశాలంటే భయం. కానీ అతడు ఫైలట్ కావాలనుకుంటాడు. మొత్తానికి ఆ రంగంలోని జాబ్ ను కొట్టేస్తాడు. ఈ క్రమంలో మొదటిసారి ఫైట్ నడుపుతున్న సమయంలో కాస్త భయపడుతూ ఉంటాడు. అతనికి కెప్టెన్(గౌతమ్ వాసుదేవ్) సహకరిస్తాడు. ఈ క్రమంలో తన భయం పొగోట్టుకునేందుకు తన ‘ఉస్తాద్’ స్టోరీ , లవ్ స్టోరీ చెబుతూ ఉంటాడు. ఉస్తాద్ స్టోరీలో భాగంగా మేఘన (కావ్య కళ్యాణ్ రామ్) ను ప్రేమిస్తాడు. అయితే ఆ తరవాత వీరి లవ్ స్టోరీ ఏమైంది? అసలు ఉస్తాద్ (బైక్) స్టోరీకి, లవ్ స్టోరీకి ఏంటి సంబంధం? అనేది సినిమా కాన్సెప్ట్
విశ్లేషణ:
‘ఉస్తాద్’ పేరు కొత్తగా ఉంది. కాన్సెప్ట్ కొత్తగా ఉంది. లవ్ ఫీల్ ఆకట్టుకుంటుంది. బైక్ తో హీరోకు ఉన్న అనుబంధాన్ని ఎమోషన్ లో చూపించడం ఆడియన్స్ ఇంప్రెస్ అవుతారు. కొన్ని కామెడీ డైలాగ్స్ ఆకట్టుకుంటాయి. ఫీ క్లైమాక్స్ లో బైక్ కు, లవ్ తో ముడిపెట్టిన సన్నివేశాలు హార్ట్ టచ్ చేస్తాయి. బైక్ తో హీరో మాట్లాడే సీన్లు, అదే బైక్ పై తన లవర్ ని కలిసే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. సినిమా ఫస్ట్ నుంచి ఎమోషన్ గానే మూవ్ అవుతుంది. అయితే డైరెక్టర్ ఈ కాన్సెప్ట్ ను అద్భుతంగా చూపించాల్సి ఉంది. కొన్ని సీన్స్ రోటీన్ గా పెట్టారు. ముఖ్యంగా స్టోరీ ప్రారంభం నుంచి కాస్త స్లో మూవ్ అవుతుంది. అంతేకాకుండా రోటిన్ డైలాగ్స్, రొటిన్ సీన్స్ కనిపిస్తాయి. చాలా మంది ప్రేక్షకులు బడా సినిమాల కంటే చిన్న సినిమాల్లోనే అసలు విషయం ఉంటుందని ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. అయితే వీటిని రిచ్ గా మలచడంలో కాస్త విఫమవుతున్నారు. మొత్తంగా సినిమా పర్వాలేదనిపించింది.
ఎవరెలా నటించారంటే?
శ్రీ సింహ గతం సినిమాల కంటే హీరోగా పనితనం చూపించాడు. సింపుల్ కుర్రాడిలా కనిపించి ఆకట్టుకున్నాడు. సినిమాలోని తన పాత్రలో లీనమైనట్లు కనిపిస్తాడు. హీరోయిన్ కావ్య సైతం మరోసారి తన యాక్టింగ్ తో ఆకట్టుకుంది. మిగతా నటులు ఆయా పాత్రలకు న్యాయం చేశారు.
సాంకేతిక వర్గం ఎలా పనిచేసిందంటే?
డైరెక్టర్ ఫణిదీప్ కథను కొత్తగా రాసుకున్నా.. దానిని మలచడంలో కాస్త విఫలమైనట్లు తెలుస్తోంది. ఈ కాన్సెప్ట్ ను మరింత అందంగా మలిచితే ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యే అవకాశం ఉండేది. నిర్మాణ విలువలు కనిపించాయి. అక్కడక్కడా బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకుంది. ఇక ఎడిటింగ్ లో లోపాలు ఎక్కువగా కనిపిస్తాయి.
ముగింపు: కథ కొత్తగా ఉన్నా.. దానిని చూపించడంలో ‘ఉస్తాద్’ బెరుకుగా కనిపిస్తుంది. కానీ లవ్, ఎమోషన్స్ తో సినిమా ఆకట్టుకుంటుంది.
రేటింగ్ : 2 / 5