Pawan Kalyan : విశాఖలో జరుగుతోంది ప్రకృతి వినాశనం. విశాఖ అంటేనే ప్రకృతి వనం. ఎంతో మంది కవులు ఆ ప్రకృతిని వర్ణిస్తూ పరవశించిపోయారు. మహా కవి శ్రీశ్రీ, అరుద్రతో సహా గాయకులు, కవులు, రచయితలు విశాఖ ప్రకృతిని వేయినోళ్ల పొగిడారు. అటువంటి ప్రకృతి అందాల విధ్వంసానికి గురవుతోంది. విశాఖ విధ్వంసానికి కుంటిసాకులు చెబుతోంది వైసీపీ.
రుషికొండ పర్యటనలో పవన్ చేసిన హాట్ కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి. పోలీసుల ఆంక్షలు నడుమే రిషికొండ ప్రాంతాన్ని పవన్ పరిశీలించారు. అయితే కొండ వద్దకు వెళ్లకూడదని బారికేడ్లు ఏర్పాటు చేసిన పోలీసులు.. దూరం నుంచే చూడాలని పవన్ కు స్పష్టం చేశారు.
అయితే పవన్ వారికి ఝలక్ ఇచ్చారు. బారికేడ్ ను దాటి మరీ రిషికొండ ప్రాంతాన్ని పరిశీలించారు. అక్కడే ఉన్న మీడియా వాహనంపై ఎక్కి నిర్మాణాలను చూశారు. కొండ తవ్వకాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అటు తర్వాత సీఎం జగన్ పై తీవ్ర విమర్శనాస్త్రాలు సంధించారు. నిబంధనలు పాటించాల్సిన సీఎం.. వాటిని ఉల్లంఘిస్తే ఎలా అని ప్రశ్నించారు.
పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్లింది జగన్ కోసం కాదు.. రుషికొండను రక్షించుకోవడం.. ప్రకృతికి కాపాడుకోవడం కోసమే అక్కడికి వెళ్లాడు.. పవన్ కళ్యాణ్ పర్యటనపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు..