Pawan Kalyan rejected Athadu movie: తెలుగు సినిమా ఇండస్ట్రీలో సూపర్ స్టార్ మహేష్ బాబు కి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ఆయన చేసిన సినిమాలు అతనికి గొప్ప గుర్తింపును సంపాదించి పెట్టడమే కాకుండా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తనవైపు తిప్పుకునేలా చేశాయి. ఇక ఇప్పటివరకు ఎవరు ఎలాంటి సినిమాలు చేసిన కూడా మహేష్ బాబుకి ఉన్న గుర్తింపు వేరే హీరోకి లేదని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. అయితే మహేష్ బాబు కెరియర్ స్టార్టింగ్ లో ఉన్నప్పుడు ఒక్కడు సినిమా సూపర్ సక్సెస్ సాధించిన తర్వాత ఆయన నిజం లాంటి సినిమాలు చేసినప్పటికి అవి ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేదు. ఇక అప్పుడే త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కలిసి అతడు సినిమా చేశాడు. ఈ సినిమా అతనికి గొప్ప గుర్తింపును సంపాదించి పెట్టింది…అతడు సినిమాని మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 9వ తేదీన రీ రిలీజ్ చేయాలనే ఆలోచనలో మేకర్స్ అయితే ఉన్నారు. మరి ఇలాంటి సందర్భంలో మురళీమోహన్ ఒక ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు.
ఇక ఈ ఇంటర్వ్యూ లో ఈ సినిమాను ముందుగా పవన్ కళ్యాణ్ కోసం అనుకున్నారు కదా అని రిపోర్టర్ ఒక ప్రశ్న అడిగినప్పటికి ఆయన సమాధానం చెబుతూ పవన్ కళ్యాణ్ కి కథ వినిపించినప్పటికి ఆయన ఆ కథను రిజెక్ట్ చేశారు. కానీ కృష్ణ గారు అంటే మాకు అభిమానం ఉంది కాబట్టి అతని కొడుకు అయిన మహేష్ బాబు తో ఒక సినిమా చేయాలని మేము ఎప్పటినుంచో అనుకున్నాం.
అందువల్లే అతడు సినిమా కథని త్రివిక్రమ్ చెప్పిన తర్వాత మహేష్ బాబు తో చేయాలని నిశ్చయించుకొని అతనితోనే చేసి సక్సెస్ ని సాధించాము అంటూ మురళీమోహన్ చెప్పిన సమాధానం ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఇక ఏది ఏమైనా కూడా ఇప్పటివరకు ఎవరు చేయనటువంటి డిఫరెంట్ పాత్రలను చేసిన ఘనత కూడా మహేష్ బాబుకే దక్కుతోంది.
Also Read: ఇంతటి నెగిటివ్ టాక్ లో ఈ రేంజ్ వసూళ్లా..? ‘హరి హర వీరమల్లు’ బాక్స్ ఆఫీస్ ర్యాంపేజ్!
మరి ఈ సినిమాలో పార్థు గా మహేష్ బాబు తన పాత్రని పోషించిన విధానం నెక్స్ట్ లెవల్ అనే చెప్పాలి.త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా తన మొదటి సినిమా అయిన నువ్వే నువ్వే సినిమా యావరేజ్ గా ఆడినప్పటికి అతడు సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు… ఇక ఈ సినిమా డిఫరెంట్ తరహాలో ఉండడమే కాకుండా ప్రేక్షకులను మెప్పించింది. ఇక ఇప్పటివరకు ఈ సినిమాను టీవీలో కొన్ని వేల సార్లు టెలికాస్ట్ చేశారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…