Ustaad Bhagat Singh: పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) అభిమానులు మళ్లీ డ్యూటీ ఎక్కాల్సిన సమయం వచ్చేసింది. ఆయన హీరో గా నటించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad Bhagat Singh) మూవీ షూటింగ్ కార్యక్రమాలను మొత్తం పూర్తి చేసుకొని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ని వేగవంతం చేసింది. ఈరోజు నుండి ఈ సినిమాకు సంబంధించిన డబ్బింగ్ కార్యక్రమాలను మొదలు పెట్టారు. శరవేగంగా డబ్బింగ్ వర్క్ ని పూర్తి చేసి, రీ రికార్డింగ్, మరియు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వర్క్ ని కూడా పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఎట్టి పరిస్థితిలోనూ ఫిబ్రవరి నెలలో ఈ సినిమాని మొత్తం DTS మిక్సింగ్, ఎడిటింగ్ తో సహా పూర్తి చేసి, మొదటి కాపీ ని సిద్ధం చేయాలనీ అనుకుంటున్నారు మేకర్స్. అందుకు తగ్గట్టుగానే టీం ని కూడా పరుగులు తీయిస్తున్నారు. నేడు డబ్బింగ్ వర్క్ మొదలు పెట్టడంతో ఈ మూవీ టీం ఒక వీడియో ని విడుదల చేయగా, అది సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది.
ఆ వీడియో ని మీరు క్రింద చూడొచ్చు. ఇకపోతే ఈ చిత్రం నుండి రీసెంట్ గానే మొదటి లిరికల్ వీడియో సాంగ్ ‘దేఖ్ లేంగే సాలా’ పాటని విడుదల చేయగా, అది ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది. దేవిశ్రీ ప్రసాద్ రొటీన్ మ్యూజిక్ ఇచ్చినప్పటికీ, పవన్ కళ్యాణ్ అద్భుతమైన స్టైల్, గ్రేస్ ఫుల్ డ్యాన్స్ మూవ్మెంట్స్ తో ఈ పాటని వేరే లెవెల్ కి తీసుకెళ్లాడు. యూట్యూబ్ లో ఈ పాటకు ఇప్పటి వరకు 45 మిలియన్ కి పైగా వ్యూస్ వచ్చాయి. రాబోయే రోజుల్లో కచ్చితంగా ఈ పాట 50 వ మిలియన్ మార్కుని అందుకునే అవకాశాలు ఉన్నాయని . ఇదంతా పక్కన పెడితే ఈ చిత్రానికి సంబంధించిన రెండవ పాట ని అతి త్వరలోనే విడుదల చేయబోతున్నారు మేకర్స్.
ఆ పాటకు సంబంధించిన వర్క్ మొత్తం పూర్తి అయ్యింది. ఫిబ్రవరి మొదటి వారంలో ఈ పాట విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే ఈ చిత్రాన్ని మార్చి 19 లేదా మార్చి 26 న విడుదల చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు తెలుస్తోంది. మార్చ్ 19 న విడుదల చేస్తే ఈ చిత్రం కచ్చితంగా ‘దురంధర్ 2’ మరియు ‘టాక్సిక్’ చిత్రాలతో పోటీ పడాల్సి ఉంటుంది. అదే కానుకగా జరిగితే ఓపెనింగ్స్ చాలా వరకు నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. అలా కాకుండా మార్చి 26 న విడుదల చేస్తే రెండు పండగ సెలవు దినాలు మిస్ చేసుకున్న వాళ్ళం అవుతాము, ఏమి చెయ్యాలి ఇప్పుడు అనే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. ఫిబ్రవరి మొదటి వారం లోనే విడుదల తేదీని అధికారికంగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.