spot_img
Homeఎంటర్టైన్మెంట్Ustaad Bhagat Singh last commercial movie: 'ఉస్తాద్ భగత్ సింగ్' పవన్ కళ్యాణ్ కెరీర్...

Ustaad Bhagat Singh last commercial movie: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ పవన్ కళ్యాణ్ కెరీర్ లో చివరి కమర్షియల్ సినిమా కానుందా?

Ustaad Bhagat Singh last commercial movie: ఒకప్పుడు టాలీవుడ్ లో కమర్షియల్ సినిమాలకు ప్రేక్షకులకు బ్రహ్మరథం పట్టేవారు. బాక్స్ ఆఫీస్ వద్ద నెలల తరబడి ఆడేవి. కానీ ఇప్పుడు పూర్తిగా పరిస్థితులు మారిపోయాయి. కోవిద్ లాక్ డౌన్ తర్వాత ఆడియన్స్ సినిమాలను చూసే పద్దతి ని పూర్తిగా మార్చేసుకున్నారు. ఫలితంగా 2024 వ సంవత్సరం నుండి కమర్షియల్ సినిమాలకు క్రేజ్ తగ్గిపోతూ వచ్చింది , అందుకు ఉదాహరణ సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన ‘గుంటూరు కారం’ చిత్రమే. టాలీవుడ్ లో ఈ కాంబినేషన్ ని అందరూ డైనోసార్ లాగా చూస్తారు. అలాంటి కాంబినేషన్ నుండి వచ్చిన సినిమాకే ఓపెనింగ్ వసూళ్లు చాలా తక్కువగా వచైయి. ఇక కాంబినేషన్ క్రేజ్ లేకుండా వచ్చే కమర్షియల్ సినిమాల పరిస్థితి ఏంటో అర్థం చేసుకోండి. అందుకు మరో లేటెస్ట్ ఉదాహరణ గా నిన్న విడుదలైన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రాన్ని తీసుకోవచ్చు.

హరీష్ శంకర్ , పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో గతంలో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ చిత్రం కమర్షియల్ గా ఎంత పెద్ద సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిల్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అప్పటి వరకు ఉన్నటువంటి ఇండస్ట్రీ రికార్డ్స్ అన్నిటినీ తుడిచి పెట్టేసి సరికొత్త ఇండస్ట్రీ హిట్ గా నిల్చండి ఈ చిత్రం. అలాంటి కాంబినేషన్ నుండి సినిమా అంటే క్రేజ్ వేరే లెవెల్ లో ఉండాలి , కానీ అది జరగలేదు. హరీష్ శంకర్ ఫామ్ లో లేకపోవడం , అతని మీద యూత్ ఆడియన్స్ లో మంచి అభిప్రాయం లేకపోవడం వల్ల , అంతే కాకుండా ఆ చిత్రం లోని పాటలు ఒక్కటి కూడా హిట్ కాకపోవడం వల్ల , ఈ సినిమా పై ఆడియన్స్ లో బజ్ ఏర్పడలేదు. ఫలితంగా మొదటిసారి పవన్ కళ్యాణ్ సినిమా అంచనాలు లేకుండా చాలా సైలెంట్ గా విడుదలైంది.

Also Read: ‘ధురంధర్ 2 ‘ మొదటి రోజు వరల్డ్ వైడ్ వసూళ్లు.. ఊహకందని అద్భుతం ఇది!

ఇక కమర్షియల్ మూవీస్ ని జనాలు చూడడం కూడా ఆపేయడం ఈ చిత్రం పై బలమైన ప్రభావం చూపించింది. ఓజీ చిత్రంతో మొదటి రోజు 150 కోట్ల రూపాయిల రేంజ్ లో గ్రాస్ వసూళ్లను రాబట్టిన పవన్ కళ్యాణ్ , ‘ఉస్తాద్ భగత్ సింగ్ ‘ చిత్రం తో కేవలం 50 కోట్ల రూపాయిల గ్రాస్ ఓపెనింగ్ ని మాత్రమే రాబట్టాడు. దీనిని బట్టే అర్థం చేసుకోవచ్చు, కమర్షియల్ సినిమాలను మన ఆడియన్స్ అసలు పట్టించుకోవడం లేదని. ఇది పవన్ కళ్యాణ్ కూడా గ్రహించాడు. అందుకే ఇక మీదట ఆయన కమర్షియల్ సినిమాల జోలికి వెళ్లకూడదని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. సురేందర్ రెడ్డి తో చేయబోయే సినిమా , అదే విధంగా ఓజీ 2 , ఓజీ 3 సినిమాలు కూడా జెన్ జీ ఆడియన్స్ కి సంబంధించిన సినిమాలే. బహుశా ‘ఉస్తాద్ భగత్ సింగ్ ‘ చిత్రమే పవన్ కళ్యాణ్ నుండి వచ్చిన చివరి కమర్షియల్ జానర్ మూవీ అనుకోవచ్చు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

R Madhavan

R Madhavan: హీరో మాధవన్ అదృశ్యం.. విద్యార్థుల గాలింపు.. అసలు ఏమి జరిగిందంటే..

R Madhavan: ఢిల్లీ లోని పార్లమెంట్ ఆవరణలో గత కొద్దీ రోజుల నుండి కాక్రోచ్ పార్టీ ఆద్వర్యం లో జరుగుతున్న విద్యార్థుల నిరసన కార్యక్రమాలు ఏ రేంజ్ లో జరుగుతున్నాయో ప్రత్యేకించి చెప్పనవసరం...
Jaya Krishna Ghattamaneni

Jaya Krishna Ghattamaneni: బయట హీరోల్లో ఆ స్టార్ హీరో కి వీరాభిమాని అంటూ ఘట్టమనేని జయకృష్ణ హాట్...

Jaya Krishna Ghattamaneni: సూపర్ స్టార్ కృష్ణ రెండవ తనయుడు , మహేష్ బాబు సోదరుడు , రమేష్ బాబు కుమారుడిగా జయ కృష్ణ ఘట్టమనేని ఇండస్ట్రీ లోకి హీరో గా...

NEET Controversy : విద్యార్థుల ఆవేదనలో అర్ధముంది మరి రాజకీయ నాయకుల ఆందోళనలో?

NEET Controversy : దేవాలయాల లాంటి విద్యాసంస్థల్లో ప్రవేశం కోసం, తమ భవిష్యత్తును దిద్దుకోవడం కోసం రాత్రింబవళ్లు కష్టపడే కోట్లాది మంది విద్యార్థుల నిరీక్షణను నీరుగార్చేలా ఇటీవల విద్యావ్యవస్థలో వరుసగా జరుగుతున్న పరిణామాలు...
Chennai Love Story

Chennai Love Story: ‘చెన్నై లవ్ స్టోరీ’ బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఎన్ని కోట్ల గ్రాస్ రాబట్టాలో తెలుసా..?...

Chennai Love Story: సినిమా సినిమాకు తన పరిధి ని పెంచుకుంటూ , యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ని సొంతం చేసుకున్న హీరో కిరణ్ అబ్బవరం. ఈయన కెరీర్...
Trisha Krishnan

Trisha Krishnan: ‘జన నాయగన్’ థియేటర్ లో త్రిష.. మీడియా ని చూడగానే పరుగులు.. వీడియో వైరల్..

Trisha Krishnan: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ హీరో గా నటించిన చివరి చిత్రం 'జన నాయగన్ ' నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలై మొదటి ఆట నుండే డిజాస్టర్ టాక్...
Oktelugu Epaper