Ustaad Bhagat Singh New Year Video: న్యూ ఇయర్ సందర్భంగా పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) అభిమానులకు నేడు మేకర్స్ డబుల్ ధమాకా ఇచ్చారు అనే చెప్పొచ్చు. ఈరోజు ఉదయం సురేందర్ రెడ్డి తో పవన్ కళ్యాణ్ తదుపరి చిత్రం ఉంటుందని అధికారికంగా ప్రకటించారు. ఈ ఏడాది సెకండ్ హాఫ్ నుండి ఈ సినిమా షూటింగ్ మొదలు కాబోతుంది. అయితే మార్చ్/ ఏప్రిల్ నెలలో విడుదల అవ్వబోతున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad Bhagat Singh Movie) మూవీ పరిస్థితి ఏంటి?, న్యూ ఇయర్ సందర్భంగా అభిమానుల కోసం ఎదో ఒక అప్డేట్ ఇవ్వొచ్చు కదా అని సోషల్ మీడియా లో డైరెక్టర్ హరీష్ శంకర్ ని రిక్వెస్ట్ చేశారు ఫ్యాన్స్. అడిగిన వెంటనే ఓకే చెప్పిన హరీష్ శంకర్ కాసేపటి క్రితమే ఒక బ్లాస్టింగ్ మోషన్ పోస్టర్ ని విడుదల చేశారు. ఒక చేతిలో రేడియో పట్టుకొని, మరో చేతిలో గన్ పట్టుకొని స్టైల్ గా నడుచుకుంటూ వస్తున్న ఫోటో అభిమానులకు తెగ నచ్చేసింది.
అయితే న్యూ ఇయర్ సందర్భంగా నేడు పోస్టర్ తో పాటు విడుదల తేదీని కూడా ప్రకటిస్తారని అనుకున్నారు ఫ్యాన్స్. కానీ అందుకు ఇంకా కాస్త సమయం పట్టేలా ఉంది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ నిర్మిస్తుంది. ఈ సినిమా తో పాటు రామ్ చరణ్ ‘పెద్ది’ చిత్రాన్ని కూడా వీళ్ళే నిర్మిస్తున్నారు . పెద్ది చిత్రాన్ని మార్చ్ 27 న రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేయబోతున్నామని మేకర్స్ ఇప్పటికే అనేక సార్లు ఫ్యాన్స్ కి క్లారిటీ ఇస్తూ వచ్చారు. కానీ షూటింగ్ చాలా వరకు బ్యాలన్స్ ఉంది. ఈ నెలాఖరు లోపు షూటింగ్ పూర్తి అయితే పెద్ది చెప్పిన తేదికి వచ్చేస్తుంది. లేదంటే పెద్ది స్థానం లో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ వస్తుంది. ఒకవేళ పెద్ది చెప్పిన తేదికి వస్తే, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఏప్రిల్ రెండవ వారం లో విడుదల అవుతుంది.
రీసెంట్ గానే ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రం ప్యాచ్ వర్క్ తో సహా పూర్తి చేసుకుంది. ఇక పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మాత్రమే బ్యాలన్స్, ఫిబ్రవరి నెలాఖరు లోపు సినిమాకు సంబంధించిన మొదటి కాపీ కూడా రెడీ అయిపోతుంది. కాబట్టి ఉస్తాద్ ని సమయానుసారం ఈ రెండు నెలల్లో ఎప్పుడైనా దింపేయొచ్చు. ఇకపోతే రీసెంట్ గానే విడుదల చేసిన ‘దేఖ్ లేంగే సాలా’ పాటకు ఏ రేంజ్ లో రెస్పాన్స్ వచ్చిందో మనమంతా చూస్తూనే ఉన్నాం. పవన్ కళ్యాణ్ తన అద్భుతమైన ఎనర్జిటిక్ డ్యాన్స్ తో ఫ్యాన్స్ ని సర్ప్రైజ్ కి గురి చేసాడు. సినిమాలో నాలుగు పాటలు ఉంటాయట, నాలుగు పాటలకు కూడా పవన్ కళ్యాణ్ వింటేజ్ ఎనర్జీ తో డ్యాన్స్ స్టెప్పులు వేసినట్టు తెలుస్తోంది.
Wishing you all a very Happy New Year ❤
May your year be filled with joy and success ✨
And remember, if there is any challenge life throws at you this year, just say…’Dekhlenge Saala, chusinam le chaala’ #UstaadBhagatSingh –
A Cult Captain @harish2you‘s Feast … pic.twitter.com/UzEKypWePy— Ustaad Bhagat Singh (@UBSTheFilm) January 1, 2026