Ustaad Bhagat Singh Netflix OTT Rights: సరిగ్గా మరో నెల రోజుల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) హీరో గా నయించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad Bhagat Singh) మూవీ విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్స్ తో సోషల్ మీడియా కళకళలాడిపోతోంది. రెండు రోజుల క్రితం విడుదల చేసిన #AuraOfUstaad పాటకు ఫ్యాన్స్ నుండి డివైడ్ రెస్పాన్స్ వచ్చింది . పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం పై పాట అనగానే జల్సా, అత్తారింటికి దారేది, గబ్బర్ సింగ్ వంటి సినిమాల్లోని టైటిల్ సాంగ్స్ రేంజ్ లో ఉంటాయని ఊహించుకున్నామని, కానీ అందులో పావు శాతం కూడా లేదని అభిమానులు బాధ పడ్డారు. ఇది సినిమా పై నెగటివ్ ప్రభావం చూపుతుందేమో అని భయపడ్డారు ఫ్యాన్స్. కానీ అలాంటిదేమి జరగలేదు. నేడే ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ రైట్స్ అమ్ముడుపోయాయి. నెట్ ఫ్లిక్స్ సంస్థ మంచి ఫ్యాన్సీ రేట్ కి ఈ సినిమాని కొనుగోలు చేసింది.
Also Read: విజయ్- రష్మిక పెళ్లి లో సందీప్ రెడ్డి వంగ కి అవమానం జరిగిందా..? అలా ఎలా చేశారు…
ఎంతకో తెలుసా..?, అక్షరాలా 82 కోట్ల రూపాయిలు. ఒక ప్రాంతీయ బాషా చిత్రానికి ఈ రేంజ్ లో ఓటీటీ రైట్స్ అమ్ముడుపోవడం ఈమధ్య కాలంలో ఎప్పుడూ జరగలేదు. పవన్ కళ్యాణ్ గత చిత్రం ‘ఓజీ’ ని ఇదే నెట్ ఫ్లిక్స్ సంస్థ 92 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. ఈ చిత్రానికి నెట్ ఫ్లిక్స్ లో కి వచ్చిన మొదటి మూడు నెలల్లో కోటి కి పైగా వ్యూస్ వచ్చాయి. అదే విధంగా పవన్ కళ్యాణ్ గత చిత్రం ‘బ్రో ది అవతార్ ‘ చిత్రానికి కూడా నెట్ ఫ్లిక్స్ లో 84 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. ఇలా పవన్ కళ్యాణ్ సినిమాలకు నెట్ ఫ్లిక్స్ లో మంచి డిమాండ్ ఉండడం తో కళ్ళు మూసుకొని నిర్మాత అడిగినంత ఆఫర్ కి ఒప్పుకున్నారు. అయితే ఈ సినిమాకు కూడా షరతులు వర్తిస్తాయి. అదేమిటంటే ఈ చిత్రం థియేటర్స్ లో విడుదలైన తర్వాత కచ్చితంగా 300 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు రావాలి.
అప్పుడే 82 కోట్ల రూపాయిలు ఇస్తారట . లేదంటే 41 కోట్ల రూపాయిలు మాత్రమే ఇస్తారట. ఇది కేవలం ‘ఉస్తాద్ భగత్ సింగ్ ‘ విషయం లోనే కాదు, ప్రతీ సినిమా విషయం లోనూ జరుగుతుంది. ఎన్టీఆర్ , ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘డ్రాగన్’ మూవీ రైట్స్ ని నెట్ ఫ్లిక్స్ సంస్థ దాదాపుగా వంద కోట్ల రూపాయలకు సొంతం చేసుకుంది. కానీ ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద కచ్చితంగా 400 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టాలి. లేదంటే 50 కోట్లు మాత్రమే ఇస్తారట. అంటే రెండు సినిమాల థియేట్రికల్ రైట్స్ దాదాపుగా సమానమే . కానీ పవన్ కళ్యాణ్ మామూలు కమర్షియల్ సినిమాతో , ఎన్టీఆర్ భారీ బడ్జెట్ ప్రెస్టీజియస్ పాన్ ఇండియన్ మూవీ తో సమానం అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిన అంశం.