Ustaad Bhagat Singh Movie Story: తెలుగు సినిమా ఇండస్ట్రీలో కమర్షియల్ డైరెక్టర్లకి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ఒకప్పుడు చాలామంది స్టార్ డైరెక్టర్లు కమర్షియల్ డైరెక్టర్లే కావడం విశేషం. ఇక ఇప్పుడైతే కమర్షియల్ సినిమాలకు పెద్దగా పెద్దపీట వెయ్యకపోయిన గ్రాఫికల్ విజువల్ వండర్స్ సినిమాల వైపు మన దర్శకులు వాళ్ళ దృష్టిని మల్లిస్తున్నారు. అయితే కమర్షియల్ సినిమాలను సైతం సక్సెస్ ఫు గా తీయగలిగే దర్శకులు కొంతమంది ఉన్నారు. అందులో హరీష్ శంకర్ (Harish Shankar)ఒకరు…ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాలా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ (Pavan kalyan) తో చేస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Usthad Bhagath Singh) సినిమా షూటింగ్ ను స్టార్ట్ చేశారు. మరి ఏది ఏమైనప్పటికి ఈ సినిమా షూటింగ్ చాలా శరవేగంగా పూర్తి చేసి సినిమాని వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ప్రయత్నంలో హరీష్ శంకర్ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇంతకు ముందు రవితేజ తో చేసిన ‘మిస్టర్ బచ్చన్’ (Mistar Bachhan) సినిమాతో ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేదు.
Also Read: కూలీ సినిమాలో గెస్ట్ రోల్ లో కనిపించనున్న మరో తెలుగు స్టార్ హీరో..?
రవితేజ (Raviteja) కెరీర్ లోనే ఆ సినిమా ఒక డిజాస్టర్ గా మిగిలింది. కాబట్టి ఇప్పుడు ఆయన నుంచి వచ్చే సినిమాల మీద ఎలాంటి అంచనాలైతే లేవు. కానీ పవన్ కళ్యాణ్ తో ఆయన సినిమా చేస్తున్నాడు అంటే ఏదో ఒక వైవిధ్యమైన కథాంశం అయితే ఉంటుంది అనే ధోరణిలో చాలామంది సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.
ఇక ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా దాదాపు మూడు సంవత్సరాల క్రితం రాసుకున్న కథ కాబట్టి ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి అప్పటికీ ఇప్పటికీ పవన్ కళ్యాణ్ పర్సనల్ లైఫ్ లో గాని, సినిమా ఇండస్ట్రీలో గాని చాలా మార్పులైతే జరిగాయి. దానికి తగ్గట్టుగానే ఈ కథలో కూడా కొన్ని మార్పులు చేర్పులు చేసినట్టుగా తెలుస్తోంది. ఇంతకుముందు పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ ని సొసైటీ కోసం ఏదైనా చేసే పోలీస్ ఆఫీసర్ గా చూపించే ప్రయత్నం చేశారు.
ఇక ఇప్పుడు దాంతో పాటుగా ఆయన పర్సనల్ రివెంజ్ కూడా సినిమాలో తీర్చుకోబోతున్నట్టుగా కథని కొంచెం మార్పులు చేర్పులు చేసినట్టుగా తెలుస్తోంది. మరి మొత్తానికైతే వీళ్ళ కాంబినేషన్ లో ఇంతకు ముందు వచ్చిన గబ్బర్ సింగ్ (Gabbar Singh) సినిమా సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించింది. ఇక అదే విధంగా ఈ సినిమా కూడా సూపర్ సక్సెస్ ని సాధిస్తుందని పవన్ కళ్యాణ్ అభిమానులు భావిస్తున్నారు…