Ustaad Bhagat Singh: ఈ ఏడాది పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) అభిమానులు ‘ఓజీ'(They Call Him OG) మూవీ మేనియా ని విడుదలకు ముందు, విడుదల తర్వాత వింటేజ్ పవర్ స్టార్ రేంజ్ హైప్, యుఫొరియా ని ఎంజాయ్ చేశారు. మొదటి రోజు ఓపెనింగ్ వసూళ్ల దగ్గర నుండి, క్లోజింగ్ వరకు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సృష్టించిన రికార్డ్స్ ని చూసి ఫ్యాన్స్ మెంటలెక్కిపోయారు. ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రానికి 166 కోట్ల రూపాయలకు జరిగింది. క్లోజింగ్ లో 300 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు, 190 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. అయితే తెలుగు రాష్ట్రాల్లో ఓజీ చిత్రాన్ని ‘ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad Bhagat Singh) డామినేట్ చేయబోతోందని బిజినెస్ వర్గాల్లో జోరుగా సాగుతున్న చర్చ. ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి ఆంధ్ర ప్రదేశ్ లో 100 కోట్ల రూపాయిల బిజినెస్ ఆఫర్స్ వస్తున్నాయని టాక్.
ఓజీ చిత్రానికి ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ ఆంధ్ర ప్రదేశ్ లో 80 కోట్ల రూపాయలకు జరగ్గా, ఫుల్ రన్ లో ఆ సినిమా 86 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. ఆంధ్ర ప్రదేశ్ లో ఓజీ తరహా చిత్రాలకంటే పర్ఫెక్ట్ కమర్షియల్ మాస్ సినిమాలకే ఎక్కువ క్రేజ్ ఉంటుంది. అందుకే ఈ సినిమాకు ఓజీ కంటే మంచి బిజినెస్ ఆఫర్స్ వస్తాయని అంచనా వేస్తున్నారు. ‘హరి హర వీరమల్లు’ చిత్రం కారణంగా ‘ఓజీ’ చిత్రానికి ఆశించిన స్థాయిలో హైర్స్ ఆఫర్లు రాలేదు. కానీ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రానికి మాత్రం కేవలం ఆంధ్ర ప్రదేశ్ నుండి 7 కోట్ల రూపాయిల బిజినెస్ జరుగుతుందని అంచనా వేస్తున్నారు. అదే విధంగా సీడెడ్ లో ఈ చిత్రానికి దాదాపుగా 23 కోట్ల రూపాయిల బిజినెస్ ఆఫర్ వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. సీడెడ్ లోని కర్నూల్, కడప, చిత్తూరు మరియు అనంతపురం జిల్లాల్లో ఈ సినిమాకు ఓజీ కంటే మంచి ఆఫర్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఓవరాల్ గా ఆంధ్ర ప్రదేశ్ + సీడెడ్ నుండి ఈ చిత్రానికి 123 కోట్ల రూపాయిల బిజినెస్ జరిగే అవకాశాలు ఉన్నాయని, నైజాం ప్రాంతం లో మాత్రం ఓజీ కంటే తక్కువ బిజినెస్ జరిగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. నైజాం చిత్రం లో ఓజీ చిత్రానికి 50 కోట్ల రూపాయిల రేంజ్ బిజినెస్ జరిగిందని, కానీ ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రానికి 45 కోట్ల రూపాయిల బిజినెస్ జరిగే అవకాశాలు ఉన్నాయని, ఇలాంటి తరహా సినిమాలకు నైజాం లో కాస్త తక్కువ బిజినెస్ జరుగుతుందని, అది సహజమే అని అంటున్నారు విశ్లేషకులు. కానీ ఓజీ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా 166 కోట్ల రూపాయిల బిజినెస్ జరిగితే, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రానికి కేవలం తెలుగు రాష్ట్రాల నుండే 168 కోట్ల బిజినెస్ జరుగుతుందని అంటున్నారు.