Ustaad Bhagat Singh Mass Glimpse : అదే రౌడీలు.. అదే పోలీస్ స్టేషన్.. గబ్బర్ సింగ్ కు, ఉస్తాద్ భగత్ సింగ్ కు తేడా అదే

ఓవరాల్ గా చూస్తే ఇది గబ్బర్ సింగ్ సినిమాకు కంటిన్యేషన్ గా కనిపిస్తోంది. గబ్బర్ సింగ్ కు , ఉస్తాద్ భగత్ సింగ్ కు కొంచెం మార్చి ఇప్పటి సమస్యలకు అనుగుణంగా తీసినట్టుగా కనిపిస్తోంది. ముఖ్యంగా పవన్ ఫ్యాన్స్ కు ఇది ఊరమాస్ సినిమా అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

Written By: NARESH, Updated On : May 11, 2023 5:53 pm

Ustad bhagath singh

Follow us on

Ustaad Bhagat Singh Mass Glimpse : గబ్బర్ సింగ్.. ఉస్తాద్ భగత్ సింగ్.. అదే హీరో.. అదే డైరెక్టర్.. కథ కూడా ఆల్ మోస్ట్ అదే.. ఒక బలమైన రౌడీని ఎదుర్కొనే పోలీస్ అధికారి.. కానీ ట్రీట్ మెంట్ మాత్రం వేరే.. అంతకుమించి తయారు చేశాడు మన డైరెక్టర్ హరీశ్ శంకర్..

గబ్బర్ సింగ్ సినిమాలో ఎలాగైతే ఓ పాతిక మంది రౌడీలు ఉన్నారో.. తాజాగా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలోనూ అంతే మంది రౌడీలు ఉన్నారు. తాజాగా విడుదల చేసిన గ్లింప్స్ లో పవన్ ఆ రౌడీలను చీల్చుకుంటూ వెళ్లిన వెళుతున్న సీన్ అదిరిపోయేలా ఉంది.

ఇక పోలీస్ స్టేషన్ కూడా అచ్చం గబ్బర్ సింగ్ మూవీలోనిది పోలి ఉండేలానే డైరెక్టర్ రూపొందించారు. రౌడీలను ఎలాగైతే గబ్బర్ సింగ్ లో పవన్ కొడుతాడో.. ఏడిపిస్తాడో అలాంటి సీన్లు ఇందులోనూ కనిపించాయి. ఈసారి కథ హైదరాబాద్ పాతబస్తీ పోలీస్ స్టేషన్ కు చేరింది.

ఈ గ్లిమ్స్ వీడియో ని చూస్తున్నంత హరీష్ శంకర్ నిజంగానే ఈ సినిమా మొదటి షెడ్యూల్ కేవలం 15 రోజులే చేశాడా అనే అనుమానం రాక తప్పదు. ఈ 15 రోజుల షూటింగ్ లో పవన్ కళ్యాణ్ ని ఊర మాస్ గెటప్ లో కొన్ని షాట్స్ చూపించాడు, అలాగే పోలీస్ గెటప్ లో పవన్ ను అద్భుతంగా చూపించాడు..ఇంత తక్కువ సమయం లో ఇంత అద్భుతమైన ఔట్పుట్ ఎలా ఇచ్చాడు అని ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు.

ఒక మంచి కంటెంట్ ఓరియెంటెడ్ సినిమా తీస్తున్నాడని మాత్రం ఈ గ్లింప్స్ తో అర్థం అయిపోయింది.ముఖ్యంగా గ్లిమ్స్ చివర్లో వైసీపీ పార్టీని ఉద్దేశిస్తూ పవన్ కళ్యాణ్ చెప్పిన డైలాగ్ కి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది.

ఓవరాల్ గా చూస్తే ఇది గబ్బర్ సింగ్ సినిమాకు కంటిన్యేషన్ గా కనిపిస్తోంది. గబ్బర్ సింగ్ కు , ఉస్తాద్ భగత్ సింగ్ కు కొంచెం మార్చి ఇప్పటి సమస్యలకు అనుగుణంగా తీసినట్టుగా కనిపిస్తోంది. ముఖ్యంగా పవన్ ఫ్యాన్స్ కు ఇది ఊరమాస్ సినిమా అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.