Ustaad Bhagat Singh First Week Collections: గత ఏడాది విడుదలైన ‘హరి హర వీరమల్లు’ సినిమా ఫలితాన్ని చూసి , ఇంతకు మించిన డిజాస్టర్ ఫ్లాప్ పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ప్లాన్ చేసుకున్నా కూడా అందుకోలేడని అంతా అనుకున్నారు. ఆ తర్వాత ఓజీ వచ్చింది, పెద్ద కమర్షియల్ హిట్ అయ్యింది, ఇక పవర్ స్టార్ టైం మొదలైంది అని అనుకుంటున్న సమయంలో 5 నెలలు పూర్తి అవ్వకముందే ఆయన నుండి వచ్చిన ‘ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad Bhagat Singh) చిత్రం ‘హరి హర వీరమల్లు’ ని మించిన డిజాస్టర్ ఫ్లాప్ అయ్యిందని అంటున్నారు. ‘హరి హర వీరమల్లు’ చిత్రానికి క్లోజింగ్ లో 125 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు, 70 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చింది. కానీ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రానికి క్లోజింగ్ లో 65 కోట్ల రూపాయిలు కూడా వచ్చే సూచనలు కనిపించడం లేదు. నాలుగు రోజులకే అన్ని ప్రాంతాల్లో కలెక్షన్స్ పడిపోయాయి.
మరి వారం రోజుల థియేట్రికల్ రన్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రాంతాల వారీగా ఎంత షేర్ వసూళ్లను రాబట్టిందో ఒకసారి చూద్దాం . ట్రేడ్ విశ్లేషకులు అందిస్తున్న లెక్కలప్రకారం చూస్తే, ఈ చిత్రానికి 7 వ రోజున 80 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు తెలుగు రాష్ట్రాల నుండి వచ్చాయి. ఇక ప్రాంతాల వారీగా వచ్చిన వసూళ్లను చూస్తే నైజాం ప్రాంతం నుండి 16 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను మొదటి వారం లో రాబట్టిన ఈ సినిమాకు, సీడెడ్ ప్రాంతం లో 8 కోట్లు, ఉత్తరాంధ్ర ప్రాంతం లో 7 కోట్ల రూపాయిలు వచ్చాయి. అదే విధంగా తూర్పు గోదావరి జిల్లా నుండి 6 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమాకు, పశ్చిమ గోదావరి జిల్లా నుండి 3 కోట్ల 50 లక్షలు, గుంటూరు జిల్లా నుండి 4 కోట్ల 30 లక్షలు , కృష్ణా జిల్లా నుండి 3 కోట్ల 80 లక్షలు , నెల్లూరు జిల్లా నుండి కోటి 70 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది.
ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల నుండి ఈ చిత్రం మొదటి వారం లో 50 కోట్ల 30 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. అదే విధంగా కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి 3 కోట్ల 40 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా , ఓవర్సీస్ ప్రాంతం నుండి 4 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. ఓవరాల్ గా 57 కోట్ల 70 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు , 100 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. పవన్ కళ్యాణ్ గత చిత్రం ‘ఓజీ’ కి వరల్డ్ వైడ్ గా మొదటి రోజున 90 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు , 154 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజున 64 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. అలాంటిది ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రానికి ఇప్పుడు క్లోజింగ్ లో ‘ఓజీ’ మొదటి రోజు కంటే తక్కువ వసూళ్లు వచ్చే అవకాశం ఉండడం నిజంగా దురదృష్టకరమే అని చెప్పొచ్చు.