Ustaad Bhagat Singh: ఈ ఏడాది పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ఓజీ(They Call Him OG) చిత్రం తో అభిమానులకు ఇచ్చిన కిక్ మామూలుది కాదు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం అభిమానులకు విపరీతంగా నచ్చేసింది. థియేటర్స్ లో దాదాపుగా 190 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు, 316 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, నెట్ ఫ్లిక్స్ లో విడుదల అయ్యాక కూడా మంచి రెస్పాన్స్ ని దక్కించుకుంటూ ముందుకు దూసుకుపోతోంది. రీసెంట్ గా ఎన్ని కొత్త సూపర్ హిట్ చిత్రాలను నెట్ ఫ్లిక్స్ లో అప్లోడ్ చేసినప్పటికీ కూడా ఓజీ చిత్రం ఇప్పటికి టాప్ 10 లో కొనసాగుతూనే ఉంది. మరో నెల రోజులు అదే రేంజ్ ట్రెండ్ అయితే ఓటీటీ లో కూడా సూపర్ హిట్ చిత్రం గా నిలుస్తుంది ఓజీ. ఇకపోతే ఓజీ తర్వాత పవన్ కళ్యాణ్ నుండి రాబోతున్న చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad Bhagat Singh).
‘గబ్బర్ సింగ్’ లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ తో చేస్తున్న చిత్రమిది. ఈ సినిమా మీద కూడా ఫ్యాన్స్ లో అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇప్పటికే ఈ చిత్రం నుండి రెండు గ్లింప్స్ వీడియోస్ వచ్చాయి, రెండిటికి కూడా ఫ్యాన్స్, ఆడియన్స్ నుండి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. అయితే ఫ్యాన్స్ ఈ సినిమా విడుదల తేదీ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతానికి అయితే మేకర్స్ ఈ సినిమాని వచ్చే ఏడాది మే నెలలో విడుదల చెయ్యాలని చూస్తున్నారు. అది కాసేపు పక్కన పెడితే ఈ సినిమాకు సంబంధించిన మొదటి లిరికల్ వీడియో సాంగ్ అప్డేట్ ని డైరెక్టర్ హరీష్ శంకర్ నిన్న ఒక మూవీ ఈవెంట్ లో అధికారికంగా తెలిపాడు. డిసెంబర్ 31 న ఈ సినిమాలోని ఒక పార్టీ థీమ్ సాంగ్ ని విడుదల చేయబోతున్నాడట.
ఈ పాటలో పవన్ కళ్యాణ్ బ్లాక్ డ్రెస్ లో కనిపిస్తాడు. డ్యాన్స్ స్టెప్పులు కూడా ఆయన చాలా కాలం తర్వాత ఈ పాటలో ఇరగదీసినట్టు సమాచారం. ప్రస్తుత ట్రెండ్ లో ఒక సినిమాపై ఆడియన్స్ లో పాజిటివ్ ఫీలింగ్ కలగాలంటే పాటలు కచ్చితంగా బాగుండాలి. హరీష్ శంకర్ కి మంచి మ్యూజిక్ టేస్ట్ ఉంది, దేవిశ్రీ ప్రసాద్ కూడా ఆయన సినిమా అంటే నూటికి నూరు శాతం ఎఫోర్ట్స్ పెడుతాడు కాబట్టి మొదటి లిరికల్ వీడియో పై అంచనాలు భారీ రేంజ్ లోనే ఉన్నాయ్. చూడాలి మరి అంచనాలను ఈ పాట ఏ మేరకు అందుకుంటుంది అనేది.