Ustaad Bhagat Singh Song: ఓజీ లాంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) నుండి రాబోతున్న చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad Bhagat Singh). షూటింగ్ కార్యక్రమాలు మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా, వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. గబ్బర్ సింగ్ లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడం తో ఈ సినిమా పై మొదట్లో ఓజీ కి మించిన క్రేజ్ ఉండేది. కానీ మధ్యలో పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీ అవ్వడం వల్ల షూటింగ్ కార్యక్రమాలు ఆగిపోవడం తో సినిమా ఆలస్యం అయ్యింది. దీంతో అప్పటి వరకు ఈ సినిమా మీదున్న క్రేజ్ కాస్త తగ్గింది. కానీ విడుదల చేసిన రెండు గ్లింప్స్ వీడియోస్ కి అద్భుతమైన రెస్పాన్స్ రావడంతో మంచి హైప్ ఏర్పడింది. ఇదంతా పక్కన పెడితే నేడు ఈ చిత్రం లోని మొదటి లిరికల్ వీడియో సాంగ్ విడుదలైంది.
‘దేఖ్లేంగే సాలా’ అంటూ సాగే ఈ పాట ని రాజమండ్రి లో ఆదిత్య జూనియర్ కాలేజ్ లో అభిమానుల సమక్ష్యం లో గ్రాండ్ గా ఈవెంట్ ని ఏర్పాటు చేసి విడుదల చేశారు. ఈ పాట లో పవన్ కళ్యాణ్ వేసిన స్టెప్పులు వేరే లెవెల్ లో ఉన్నాయి. ముఖ్యంగా ఆయన లుక్స్ మామూలు రేంజ్ లో లేవు. అంతే కాకుండా పవన్ కళ్యాణ్ నుండి ఈ రేంజ్ డ్యాన్స్ స్టెప్పులు అభిమానులు ఊహించలేదు. అప్పుడెప్పుడో గబ్బర్ సింగ్ చిత్రం లోనే ఈ రేంజ్ ఎనర్జీ ని అభిమానులు పవన్ కళ్యాణ్ లో చూసారు. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడే చూస్తున్నారు. అంతా బాగానే ఉంది కానీ, ఓజీ లాంటి హై క్లాస్ మ్యూజిక్ ని విన్న తర్వాత, ఇలాంటి మాస్ కమర్షియల్ పాట విని, ట్యూన్ కాస్త రొటీన్ గా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు.
దేవిశ్రీ ప్రసాద్ పాటలు ఇదే రేంజ్ లో ఉంటాయి. కానీ అవి లాంగ్ రన్ లో పెద్ద హిట్ అవుతుంటాయి. ఈ పాటకు కూడా అదే రిపీట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద విజువల్స్ పరంగా ఈ సాంగ్ అభిమానులకు ఒక అద్భుతమైన ట్రీట్ లాగా నిలబడబోతుంది. ఇకపోతే ఈ సినిమాని వచ్చే ఏడాది ఏప్రిల్ నెలలో విడుదల చేస్తామని మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. కానీ ‘పెద్ది’ సినిమా షూటింగ్ పూర్తి అవ్వకపోతే మార్చ్ 27 న విడుదలయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇదే రేంజ్ కంటెంట్ భవిష్యత్తులో కూడా వస్తే కచ్చితంగా ఈ చిత్రం ఓజీ ని మించినది అవుతుందని అంటున్నారు విశ్లేషకులు. చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది. అభిమానులను ఊర్రూతలూ ఊగిస్తున్న ఈ పాటను మీరు కూడా చూసేయండి.
#UstaadBhagatSingh first single #DekhlengeSaala out now ❤
This song Will be celebrated for a long time
Cult Captain @harish2you‘s Feast
A Rockstar @ThisisDsp Musical ❤️
Sung by @vishaldadlani, @HariPriyaSinger
Lyrics @bhaskarabhatla… pic.twitter.com/c46kgbYpGQ— Ustaad Bhagat Singh (@UBSTheFilm) December 13, 2025