https://oktelugu.com/

Urvashi Rautela Remuneration: నిమిషానికి కోటి వసూలు చేస్తున్న వాల్తేరు వీరయ్య భామ ఊర్వశి… దేశంలోనే అత్యంత కాస్ట్లీ హీరోయిన్!

సంక్రాంతి విన్నర్ వాల్తేరు వీరయ్య మూవీలో ఊర్వశి ఐటెం సాంగ్ చేశారు. బాస్ పార్టీ సాంగ్ లో చిరుతో ఆడిపాడారు. తాజాగా బ్రో మూవీ నుండి విడుదలైన సాంగ్ లో కూడా ఊర్వశి రాతెలా చేయడం విశేషం. నెక్స్ట్ ఆమె స్కంద చిత్రంలో సందడి చేయనుంది. స్కంద సెప్టెంబర్ 15న వరల్డ్ వైడ్ ఐదు భాషల్లో విడుదల కానుంది. శ్రీలీల హీరోయిన్ కాగా, థమన్ సంగీతం అందిస్తున్నారు.

Written By: , Updated On : July 10, 2023 / 01:18 PM IST
Urvashi Rautela Remuneration

Urvashi Rautela Remuneration

Follow us on

Urvashi Rautela Remuneration: హీరోయిన్స్ కంటే ఐటెం భామల పనే బాగుంది. కేవలం ఒకటి రెండు రోజుల షూటింగ్ కి కోట్లు కొల్లగొడుతున్నారు. ఈ విషయంలో బాలీవుడ్ గ్లామర్ డాల్ ఊర్వశి రాతెలా ఎవరికీ అందనంత ఎత్తులో ఉంది. తాజాగా ఆమె గురించి ప్రచారం అవుతున్న ఒక వార్త అందరి మైండ్స్ బ్లాక్ చేస్తుంది. ఊర్వశి రాతెలా ఏకంగా నిమిషానికి కోటి రూపాయలు వసూలు చేస్తుందట. దర్శకుడు బోయపాటి శ్రీను-రామ్ పోతినేని కాంబోలో తెరకెక్కుతున్న స్కంద మూవీలో ఊర్వశి రాతెలా ఒక ఐటెం సాంగ్ చేశారు. మూడు నిమిషాల నిడివి ఉండే ఈ పాటకు ఊర్వశి రాతెలా ఏకంగా రూ. 3 కోట్లు తీసుకున్నారట.

అంటే ఆమె నిమిషానికి కోటి రూపాయలు వసూలు చేసినట్లు అయ్యింది. స్టార్స్ హీరోయిన్స్ సినిమాకు రూ. 4-5 కోట్లు తీసుకుంటున్నారు. అయితే వాళ్ళు సినిమాకు నెలల తరబడి కేటాయించాల్సి వస్తుంది. ఒకటి రెండు రోజుల్లో ముగిసే ఐటెం సాంగ్స్ కి ఐటెం భామలు భారీగా ఛార్జ్ చేస్తున్నారు. మూడు కోట్లు అంటే ఓ స్టార్ హీరోయిన్ పూర్తి సినిమాకు తీసుకునే రెమ్యూనరేషన్. డిమాండ్ ఉన్న నేపథ్యంలో ఊర్వశి భారీగా ఛార్జ్ చేస్తున్నారు.

సంక్రాంతి విన్నర్ వాల్తేరు వీరయ్య మూవీలో ఊర్వశి ఐటెం సాంగ్ చేశారు. బాస్ పార్టీ సాంగ్ లో చిరుతో ఆడిపాడారు. తాజాగా బ్రో మూవీ నుండి విడుదలైన సాంగ్ లో కూడా ఊర్వశి రాతెలా చేయడం విశేషం. నెక్స్ట్ ఆమె స్కంద చిత్రంలో సందడి చేయనుంది. స్కంద సెప్టెంబర్ 15న వరల్డ్ వైడ్ ఐదు భాషల్లో విడుదల కానుంది. శ్రీలీల హీరోయిన్ కాగా, థమన్ సంగీతం అందిస్తున్నారు.

కాగా గత ఏడాది ఊర్వశి రాతెలా లెజెండ్ మూవీ చేశారు. శరవణన్ స్టోర్స్ అధినేత అరుళ్ శరవణన్ హీరోగా తెరకెక్కిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ లో ఊర్వశి రాతెలా గ్లామర్ హైలెట్ అని చెప్పాలి. ముక్కూ ముఖం తెలియని హీరో పక్కన నటించేందుకు ఊర్వశి భారీగా ఛార్జ్ చేశారని సమాచారం. మోడల్ అయిన ఊర్వశి రాతెలా సిల్వర్ స్క్రీన్ ని దున్నేస్తుంది. సౌత్ లో ఆమెకు మరిన్ని ఆఫర్స్ వచ్చే సూచనలు కలవు.