Upendra : పదేళ్ల తర్వాత ఉపేంద్ర మరోసారి దర్శకుడిగా, హీరోగా ద్విపాత్రాభినయం చేస్తూ తీసిన లేటెస్ట్ చిత్రం ‘UI’. ఉపేంద్ర దర్శకత్వం లో వచ్చే సినిమాలంటే అటు కన్నడ ఆడియన్స్ తో పాటు, ఇటు తెలుగు ఆడియన్స్ కూడా విపరీతమైన ఆసక్తి చూపిస్తారు. ఎందుకంటే ఆయన ఆలోచనలు ప్రస్తుతం సమాజంలో జరుగుతున్నా వాటి గురించి తన అభిప్రాయాన్ని సినిమాల ద్వారా చెప్పే విధంగా ఉంటాయి. వాటిని తన టేకింగ్ తో చాలా బోల్డ్ గా చెప్పే ప్రయత్నం చేస్తుంటాడు ఆయన. అందుకే ఆయన సినిమాలకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. చాలా కాలం తర్వాత తనదైన మార్క్ తో తీసిన ఈ UI చిత్రం నిన్న తెలుగు, కన్నడ, హిందీ మరియు తమిళం భాషల్లో గ్రాండ్ గా విడుదలై, మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. ఉపేంద్ర దర్శకత్వం లో వచ్చే సినిమా అంటే, ఆడియన్స్ ఎలాంటి అంచనాలతో థియేటర్స్ లోకి అడుగుపెడుతారో, ఆ అంచనాలకు మించే ఈ చిత్రం ఉంది.
అందువల్ల ఓపెనింగ్స్ అదిరిపోయాయి. ముఖ్యంగా కర్ణాటక రాష్ట్రంలో ఉపేంద్ర కి బలమైన ఓపెనింగ్స్ పడి దశాబ్దం దాటింది. కానీ ఈ చిత్రం మాత్రం వింటేజ్ ఉపేంద్ర మాస్ అంటే ఏంటో మరోసారి ఆడియన్స్ కి రుచి చూపించింది. బుక్ మై షో యాప్ లో నిన్న ఒక్క రోజే ఈ చిత్రానికి లక్షకు పైగా టికెట్స్ అమ్ముడుపోయాయట. కన్నడ సినీ పరిశ్రమలో ఈ ఏడాది విడుదలైన అన్ని సినిమాలకంటే, ఈ చిత్రానికే ఎక్కువ టికెట్స్ సేల్ అయ్యాయట. ఓపెనింగ్స్ విషయం లో కూడా ఈ చిత్రం ఈ ఏడాది కర్ణాటక లో నెంబర్ 1 గా నిలిచిందని అంటున్నారు అక్కడి ట్రేడ్ విశ్లేషకులు. వాళ్ళు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి కర్ణాటక రాష్ట్రంలో మొదటి రోజు 18 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చినట్టు చెప్తున్నారు.
ఉపేంద్ర కెరీర్ లోనే హైయెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన చిత్రం గా UI సరికొత్త చరిత్ర సృష్టించింది. కేవలం ఉపేంద్ర కెరీర్ లో మాత్రమే కాదు, కర్ణాటక లో ఆల్ టైం టాప్ 5 ఓపెనింగ్స్ సాధించిన చిత్రాలలో UI నిల్చింది. ఈరోజు రేపటికి కూడా అడ్వాన్స్ బుకింగ్స్ అద్భుతంగా ఉన్నాయి. తెలుగు లో కూడా నిన్నటితో పోలిస్తే నేడు షోస్ సంఖ్య బాగా పెరిగింది. ట్రెండ్ చూస్తుంటే కచ్చితంగా ఈ చిత్రం వీకెండ్ కి 50 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి, ఫుల్ రన్ లో 100 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను అవలీలగా అందుకునే అవకాశం ఉందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. కేవలం వంద కోట్ల రూపాయిల వద్దనే ఈ సినిమా ఆగే అవకాశం లేదు. ఇంకా ఎక్కువ వసూళ్లను రాబట్టిన ఆశ్చర్యపోనక్కర్లేదు. చూడాలి మరి ఈ చిత్రం ఫుల్ రన్ లో ఏ రేంజ్ కి వెళ్తుంది అనేది.