Mufasa : హాలీవుడ్ ఆడియన్స్ తో పాటు ఇండియన్ ఆడియన్స్ కూడా ఎంతో ఆత్రుతతో ఎదురు చూసిన చిత్రం ‘ముఫాసా : ది లయన్ కింగ్’. 2019 వ సంవత్సరంలో సంచలన విజయం సాధించిన ‘ది లయన్ కింగ్’ చిత్రానికి ఇది సీక్వెల్. అందుకే ఈ లైవ్ యానిమేషన్ చిత్రానికి ఇంతటి హైప్, క్రేజ్ ఏర్పడింది. ఇండియా లో ఈ చిత్రానికి మంచి క్రేజ్ ఉందనే విషయాన్ని గమనించిన డిస్నీ సంస్థ, ఆడియన్స్ కి ఈ చిత్రాన్ని మరింత చేరువ చేసేందుకు, ఆయా భాషలకు సంబంధించిన టాప్ స్టార్స్ తో ‘ముఫాసా’ క్యారక్టర్ కి డబ్బింగ్ చెప్పించారు. బాలీవుడ్ లో షారుఖ్ ఖాన్ ఈ పాత్రకు డబ్బింగ్ చెప్పగా, టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ పాత్రకి డబ్బింగ్ చెప్పాడు. సోషల్ మీడియా లో ఒక్కసారి ‘ముఫాసా : ది లయన్ కింగ్’ అనే ట్యాగ్ ని క్లిక్ చేసి చూస్తే, మొత్తం మహేష్ బాబు అభిమానులు ఈ సినిమాకి థియేటర్స్ లో చేసిన హంగామానే కనిపిస్తుంది.
రెండు తెలుగు రాష్ట్రాల్లో మహేష్ బాబు అభిమానులు పలు సెలెక్టివ్ థియేటర్స్ ని ఎంచుకొని ఈ సినిమాని గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసారు. వాళ్ళ వైపు నుండి ఈ చిత్రాన్ని ముందుకు నెట్టేందుకు చాలా గట్టి ప్రయత్నమే చేసారు కానీ, సినిమాలో కంటెంట్ పెద్దగా లేకపోవడం తో నెగటివ్ టాక్ వచ్చింది. ఆ నెగటివ్ టాక్ ప్రభావం వల్ల ఈ సినిమా వసూళ్ల పై భారీ ప్రభావం పడింది. కానీ మహేష్ కి ఉన్న క్రేజ్ కారణంగా హైదరాబాద్, బెంగళూరు, వైజాగ్, విజయవాడ వంటి ప్రధాన నగరాల్లో ఈ చిత్రానికి డీసెంట్ స్థాయి గ్రాస్ నమోదైంది. ఓవరాల్ గా ట్రేడ్ విశ్లేషకుల అంచనా ప్రకారం ఈ చిత్రానికి మొదటి రోజు తెలుగు వెర్షన్ వరకు 5 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయని అంటున్నారు.
కేవలం తెలుగు వెర్షన్ లోనే కాదు, హిందీ తమిళం వెర్షన్స్ లో కూడా ఈ చిత్రానికి డీసెంట్ స్థాయి ఓపెనింగ్స్ వచ్చాయి. హిందీ లో ఈ చిత్రానికి 14 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయని అంటున్నారు. నెగటివ్ టాక్ కి ఈ రేంజ్ అంటే, పాజిటివ్ టాక్ వచ్చి ఉండుంటే ఈ చిత్రం కచ్చితంగా పాతిక కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ కేవలం హిందీ నుండే వచ్చేదని అంటున్నారు. తమిళం లో కూడా దాదాపుగా 5 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయట. ఓవరాల్ గా ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద ఈ చిత్రానికి మొదటి రోజు అన్ని ప్రాంతీయ భాషలకు కలిపి 25 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చిందట. నిన్న విడుదలైన అన్ని చిత్రాలకంటే ఈ సినిమాకే ఎక్కువ వసూళ్లు వచ్చాయని టాక్. ఓవరాల్ ప్రపంచవ్యాప్తంగా ఇంగ్లీష్ వెర్షన్ ని కూడా కలుపుకొని చూస్తే కచ్చితంగా మొదటిరోజు 500 కోట్ల రూపాయిల గ్రాస్ ఉంటుందని అంటున్నారు.