https://oktelugu.com/

Upendra : ఉపేంద్ర ‘UI’ 12 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు..తెలుగు రాష్ట్రాల్లో ఇంత కలెక్షన్స్ వస్తుందని ఎవ్వరూ ఊహించి ఉండరు!

కన్నడ హీరో ఉపేంద్ర దర్శకత్వం వహించే సినిమాలకు ప్రత్యేకమైన ఆడియన్స్ ఉన్నారు. ఆయన ఆలోచనలు చాలా కొత్తగా ఉంటాయి.

Written By:
  • Vicky
  • , Updated On : January 1, 2025 / 05:53 PM IST

    Upendra

    Follow us on

    Upendra : కన్నడ హీరో ఉపేంద్ర దర్శకత్వం వహించే సినిమాలకు ప్రత్యేకమైన ఆడియన్స్ ఉన్నారు. ఆయన ఆలోచనలు చాలా కొత్తగా ఉంటాయి. రెండు దశాబ్దాలకు ముందే ఆయన 2020 దాటాక ఇండియాలో ఎలాంటి పరిస్థితులు ఉంటాయో తన సినిమాల ద్వారా ఆడియన్స్ కి చూపించాడు. ఆ చిత్రాలను ఇప్పుడు చూసినా చాలా కొత్తగా ఉంటుంది. ఇలాంటి ఆలోచనలు అప్పట్లోనే ఈయనకి ఎలా వచ్చాయి అని ఆశ్చర్యపోక తప్పదు. అందుకే ఆయన ఇంత దర్శకులతో చేసే సినిమాలకంటే, ఆయన దర్శకత్వం లో వచ్చే సినిమాల కోసం ఆడియన్స్ ఎక్కువగా ఎదురు చూస్తూ ఉంటారు. రీసెంట్ గా ఆయన చాలా కాలం తర్వాత దర్శకత్వం వహిస్తూ, హీరో గా నటించిన ‘UI’ చిత్రం భారీ అంచనాల నడుమ విడుదలైంది. మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా నిన్నటితో 12 రోజులు పూర్తి చేసుకుంది. ఈ 12 రోజులకు ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం ఎంత వసూళ్లను రాబట్టిందో ఒకసారి చూద్దాం.

    తెలుగు రాష్ట్రాల్లో ఉపేంద్ర కి మొదటి నుండి మంచి క్రేజ్ ఉంది. ఆయన హీరో గా నటించిన ‘ఉపేంద్ర’, ‘రా’, ‘ఏ’ వంటి సినిమాలు ఇక్కడ సంచలన విజయాలు గా నమోదు చేసుకున్నాయి. అప్పట్లో ఈ చిత్రాలు థియేటర్స్ లో వంద రోజులకు పైగా ఆడాయి. ఉపేంద్ర కి మంచి క్రేజ్ ని తెచ్చిపెట్టింది. యూట్యూబ్ లో కూడా ఈ సినిమాలను మన ప్రేక్షకులు బోర్ కొట్టినప్పుడల్లా చూస్తుంటారు. అలాంటి ఉపేంద్ర నుండి, అదే తరహా సినిమాగా UI రాబోతుంది అని తెలియడం తో ఆడియన్స్ ఈ చిత్రం కోసం బాగా ఎదురు చూసారు. అలా భారీ అంచనాల నడుమ తెలుగు రాష్ట్రాల్లో విడుదలైన ఈ సినిమాకి ఇప్పటి వరకు 5 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చినట్టు తెలుస్తుంది.

    సంక్రాంతి సినిమాలు విడుదలయ్యే వరకు ఈ చిత్రానికి థియేట్రికల్ రన్ ఉంటుంది కాబట్టి తెలుగు లో మరో కోటి రూపాయిల గ్రాస్ ని రాబట్టే అవకాశాలు ఉన్నాయి. ఇక కర్ణాటక లో ఈ చిత్రానికి ఇప్పటి వరకు 33 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. అదే విధంగా రెస్ట్ ఆఫ్ ఇండియా లో కోటి రూపాయిలు, ఓవర్సీస్ లో రెండు కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ ని రాబట్టిన ఈ చిత్రం మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా 41 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ అందుకోవాలంటే ఇంకా 16 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టాల్సిన అవసరం ఉంది. అంటే 30 కోట్ల రూపాయిల గ్రాస్ ని రాబట్టాలి. కలెక్షన్స్ స్టడీ గా ఉన్నప్పటికీ బ్రేక్ ఈవెన్ నెంబర్ ఎక్కువ ఉండడంతో కమర్షియల్ గా ఈ చిత్రం ఫ్లాప్ అయ్యే అవకాశాలే ఉన్నాయని అంటున్నారు ట్రేడ్ పండితులు.