Peddi movie Shivraj Kumar role: తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్తపుంతలు తొక్కుతూ ముందుకు దూసుకెళ్తుంది. రామ్ చరణ్ లాంటి నటుడు సైతం తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని ముందుకు తీసుకెళుతున్నాడు. గత సంవత్సరం ‘గేమ్ చేంజర్’ సినిమా తో కొంతవరకు డీలా పడిన ఆయన ప్రస్తుతం ‘పెద్ది’ సినిమాతో మరోసారి ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తున్నాడు. జూన్ 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాతో ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడు అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమాలో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ ఒక కీలకమైన పాత్రలో నటిస్తున్నాడు అయితే ఈ పాత్ర కోసం మొదట వేరే హీరోలను అనుకున్నారట.
కానీ అనుకోని కారణాల వల్ల ఫైనల్ గా శివరాజ్ కుమార్ కి ఆ పాత్ర చేసే అవకాశం దక్కింది. అతని కంటే ముందు ఉపేంద్ర, విక్రమ్ లాంటి నటులతో ఈ క్యారెక్టర్ చేయించాలని అనుకున్నారు. కానీ వాళ్ళిద్దరు హ్యాండ్ ఇవ్వడంతో శివరాజ్ కుమార్ తో ఈ పాత్రను చేయించినట్టుగా తెలుస్తుంది. ఇక ఏది ఏమైనా కూడా శివరాజ్ కుమార్ సైతం భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు.
ఇక అతను కన్నడ సినిమా ఇండస్ట్రీలో హీరోగా పెను సంచలనాన్ని క్రియేట్ చేశాడనే చెప్పాలి. అలాంటి నటుడు ఈ సీన్లో ఉండటం వల్ల కన్నడ సినిమా ఇండస్ట్రీ మార్కెట్ కి బాగా ప్లస్ అవుతుందనే ఉద్దేశ్యంతోనే అతన్ని ఈ క్యారెక్టర్ లో తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఏది ఏమైనా కూడా రామ్ చరణ్ తనదైన రీతిలో సక్సెస్ ను సాధించాల్సిన సమయమైతే ఆసన్నమైంది.
ఇక బుచ్చిబాబు ఈ సినిమాలో రామ్ చరణ్ ను డిఫరెంట్ గా ప్రజెంట్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక బుచ్చిబాబు ఈ సినిమాని ఏ రేంజ్ సక్సెస్ గా నిలుపుతాడు. తద్వారా ఈ సినిమాతో ప్రేక్షకులను మెప్పించగలుగుతాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది…