Upendra : కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర(Upendra) ఆరోగ్య పై సోషల్ మీడియా లో గత రెండు రోజులుగా అనేక ప్రచారాలు జరుగుతున్నాయి. ఆయన హాస్పిటల్ కి వెళ్లడమే అందుకు కారణం. అభిమానులు ఈ విషయం తెలుసుకొని అసలు ఉపేంద్ర కి ఏమైంది?, ఆయన ఆరోగ్య పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది అంటూ ఆందోళన వ్యక్తం చేస్తూ ట్వీట్స్ వేశారు. లోకల్ మీడియా నుండి నేషనల్ మీడియా వరకు ఉపేంద్ర హాస్పిటల్ లో అడ్మిట్ అయిన విషయం పై కథనాలు రావడం తో దేశవ్యాప్తంగా ఉన్న ఉపేంద్ర అభిమానులు కంగారు పడ్డారు. ఈ సమాచారం ఉపేంద్ర దృష్టికి వెళ్లడం తో వెంటనే ఆయన తన ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందించారు. దీంతో ఆందోళన చెందిన ఉపేంద్ర అభిమానులు కాస్త రిలాక్స్ అయ్యారు. భయాందోళనకు గురి చేసిన మీడియా పై విరుచుకుపడ్డారు.
Also Read : ఉపేంద్ర ‘UI’ మూవీ ఓటీటీ విడుదల తేదీ వచ్చేసింది..ఎందులో చూడాలంటే!
ఉపేంద్ర మాట్లాడుతూ ‘అందరికీ నమస్కారం..నా ఆరోగ్యం పై అభిమానులు ఆందోళన చెందుతున్న విషయం నా దృష్టికి వచ్చింది. నేను సంపూర్ణమైన ఆరోగ్యం తోనే ఉన్నాను. కేవలం రెగ్యులర్ చెకప్ లో భాగంగానే హాస్పిటల్ కి వెళ్ళాను. అంతకు మించి ఏమి లేదు. మీడియా లో వచ్చే రూమర్స్ ని నమ్మి కంగారు పడకండి. నాపై, నా ఆరోగ్యం పై ఇంత శ్రద్ద, ప్రేమ, కేరింగ్ చూపిస్తున్నందుకు ధన్యవాదాలు’ అంటూ చెప్పుకొచ్చాడు. ఆయన వేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఇదంతా పక్కన పెడితే ఉపేంద్ర రీసెంట్ గానే UI అనే చిత్రం తో మన ముందుకొచ్చి, చాలా కాలం తర్వాత ఒక మంచి కామెరికాల్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆయన ప్రముఖ కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ తో కలిసి ’45’ అనే మల్టీస్టార్రర్ చిత్రం చేసాడు. అతి త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
తెలుగు ఆడియన్స్ కి ఒకప్పుడు కన్నడ హీరోలు ఎవరో తెలిసేవాళ్ళు కాదు. అలాంటి రోజుల్లోనే ఉపేంద్ర మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ లో సెన్సేషన్ సృష్టించాడు. ఆరోజుల్లో ఆయన హీరో గా నటించిన ‘రా’, ‘ఉపేంద్ర’ వంటి చిత్రాలు కమర్షియల్ గా మన తెలుగు రాష్ట్రాల్లో సెన్సేషన్ సృష్టించాయి. ఈ చిత్రాల తర్వాత ఉపేంద్ర కి మన తెలుగు ఆడియన్స్ లో స్టార్ హీరోలతో సమానమైన క్రేజ్ ఏర్పడింది ఆరోజుల్లో. ఈ చిత్రాలకు సంబంధించిన సన్నివేశాలను నెటిజెన్స్ సోషల్ మీడియా లో అప్లోడ్ చేస్తూ, ఆరోజుల్లోనే ఇంత అద్భుతంగా, అడ్వాన్స్ గా అలోచించి సినిమాలు ఎలా తీసావు అంటూ ఉపేంద్ర ని మెచ్చుకున్నారు. సోషల్ మీడియా వచ్చిన తర్వాత కన్నడ స్టార్ హీరోలు ఎవరు అనేది మన అందరికీ ఇప్పుడు తెలిసింది కానీ, ఆరోజుల్లో కన్నడ సినీ ఇండస్ట్రీ అంటే ఉపేంద్ర మాత్రమే, ఆ రేంజ్ లో తన ఇమేజ్ ని ఏర్పాటు చేసుకున్నాడు.
Also Read : ఉపేంద్ర ‘UI’ 12 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు..తెలుగు రాష్ట్రాల్లో ఇంత కలెక్షన్స్ వస్తుందని ఎవ్వరూ ఊహించి ఉండరు!