https://oktelugu.com/

Project K: అప్డేటెడ్ ఆదిత్య 369?… భవిష్యత్ లో ప్రభాస్ శత్రు విధ్వంసం!

ప్రాజెక్ట్ కే కథపై ఓ న్యూస్ ప్రముఖంగా వినిపిస్తోంది. హీరో ప్రభాస్ కాలంలో ప్రయాణం చేస్తాడని. ప్రస్తుతం నుండి గతంలోకి అలాగే భవిష్యత్తు లోకి ప్రభాస్ వెళతాడట. ఈ క్రమంలో ఆయన గెటప్స్ రకరకాలుగా ఉంటాయట. ఫస్ట్ లుక్ ఆ విషయాన్ని ధ్రువీకరించినట్లుగా ఉంది. దశాబ్దాల క్రితం వచ్చిన ఆదిత్య 369 మూవీలో హీరో బాలకృష్ణ కాలంలో ప్రయాణం చేస్తాడు. ప్రాజెక్ట్ కే... ఆదిత్య 369 అప్డేట్ వెర్షన్ కావచ్చు.

Written By: , Updated On : July 19, 2023 / 04:53 PM IST
Project K

Project K

Follow us on

Project K: ప్రాజెక్ట్ కే చిత్రం నుండి కీలక అప్డేట్ ఇచ్చారు. ప్రభాస్ ఫస్ట్ లుక్ విడుదల చేశారు. జులై 19న మధ్యాహ్నం 1:23 నిమిషాలకు ప్రభాస్ ఫస్ట్ లుక్ అంటూ ప్రకటించారు. అయితే చెప్పిన టైం కి ఫస్ట్ లుక్ రాలేదు. ఎట్టకేలకు మూడు గంటల తర్వాత ప్రాజెక్ట్ కే ఫస్ట్ లుక్ విడుదల చేశారు. లాంగ్ హెయిర్ ఐరన్ సూట్ లో సూపర్ హీరోగా ప్రభాస్ ఉన్నాడు. పోస్టర్ బ్యాక్ గ్రౌండ్ మరో గ్రహంలా ఉంది. అలాగే కొన్ని వందల సంవత్సరాల అనంతరం భూగ్రహంలా కూడా ఉంది. ప్రభాస్ కళ్ళలో ఇంటెన్స్ ఆకట్టుకుంది. బలమైన శత్రువులతో యుద్ధం చేస్తున్న ప్రభాస్ లుక్ మెప్పించింది.

కాగా ప్రాజెక్ట్ కే కథపై ఓ న్యూస్ ప్రముఖంగా వినిపిస్తోంది. హీరో ప్రభాస్ కాలంలో ప్రయాణం చేస్తాడని. ప్రస్తుతం నుండి గతంలోకి అలాగే భవిష్యత్తు లోకి ప్రభాస్ వెళతాడట. ఈ క్రమంలో ఆయన గెటప్స్ రకరకాలుగా ఉంటాయట. ఫస్ట్ లుక్ ఆ విషయాన్ని ధ్రువీకరించినట్లుగా ఉంది. దశాబ్దాల క్రితం వచ్చిన ఆదిత్య 369 మూవీలో హీరో బాలకృష్ణ కాలంలో ప్రయాణం చేస్తాడు. ప్రాజెక్ట్ కే… ఆదిత్య 369 అప్డేట్ వెర్షన్ కావచ్చు.

అయితే ఇక్కడ కథ వేరు. ప్రభాస్ పాత్రకు సూపర్ నాచురల్ పవర్స్ ఉండే అవకాశం ఉంది. గతంతో పాటు భవిష్యత్ లో ప్రభాస్ శత్రువులతో యుద్ధం చేయనున్నాడట. ఈ క్రమంలో దీపికా పదుకొనె, అమితాబ్, కమల్ హాసన్ పాత్రలు ఏంటనేది ఆసక్తికర పరిణామం. కమల్ హాసన్ నెగిటివ్ రోల్ చేస్తున్నారనే ప్రచారం జరుగుతుంది. అయితే స్పష్టత లేదు. ప్రాజెక్ట్ కే రెండు భాగాలుగా విడుదల కానుందంటున్నారు.

ఇక ప్రాజెక్ట్ కే టీమ్ అమెరికా వెళ్లారు. జులై 20న ప్రారంభం కానున్న శాన్ డియాగో కామిక్ కాన్ ఈవెంట్లో పాల్గొననున్నారు. ఈ వేదికపై ప్రాజెక్ట్ కే టైటిల్ ఫస్ట్ గ్లింప్స్ విడుదల చేయనున్నారు. శాన్ డియాగో కామిక్ కాన్ ఈవెంట్ కి ఆహ్వానం లభించిన ఏకైన ఇండియన్ మూవీగా ప్రాజెక్ట్ కే రికార్డులకు ఎక్కింది. వైజయంతీ మూవీస్ బ్యానర్లో అశ్వినీ దత్ ప్రాజెక్ట్ కే చిత్రాన్ని నిర్మిస్తున్నారు.