https://oktelugu.com/

Regina Cassandra: సన్నీలియోన్ లా ఆ స్టార్ అవ్వాలనుకున్నా.. రెజీనా ఘాటు కోరిక దుమారం

తెలుగు, తమిళ ఇండస్ట్రీల్లో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న రెజీనా గురించి తెలియని వారుండరు. 1988 డిసెంబర్ 13న రెజీనా చెన్నైలో జన్మించారు. తెలుగులో ‘శివ మనసులో శృతి’ అనే సినిమాతో 2012లో ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత కొత్త జంటతో ఫేమస్ అయింది. రవితేజ లాంటి స్టార్ హీరోలతో నటించిన ఈమె హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాల్లోనూ ఆకట్టుకుంది. ఇక తమిళంలో బిజీ నటిగా మారిపోయిన అమ్మడు ప్రస్తుతం అవకాశాల్లేక ఖాళీగానే ఉంటోంది.

Written By:
  • Srinivas
  • , Updated On : July 19, 2023 / 04:36 PM IST
    Follow us on

    Regina Cassandra: ఒక్కోసారి కొందరు సినీ స్టార్లు చేసే కామెంట్లు పేలుతూ ఉంటాయి. వారు చేసే వ్యాఖ్యలు వేరే ఉద్దేశమైనా సోషల్ మీడియాలో ద్వందార్థంతో అవి రచ్చవుతాయి. అయితే ఈ కామెంట్ల వల్ల హీరోయిన్ల గురించి తీవ్రంగా చర్చ ఉంటుంది. ఇప్పుడు రెజీనా అనే హీరోయిన్ కూడా సంచలన కామెంట్స్ చేసింది. ఆమె చేసిన వ్యాఖ్యలతో నెటిజన్లు రకరకాలుగా అనుకుంటారు. అయితే ఆమె ఏ ఉద్దేశంతో వ్యాఖ్యలు చేసినా.. అవి అనుచిత వ్యాఖ్యలే అని అంటున్నారు. ఇంతకీ ఆ హీరోయిన్ చేసిన వ్యాఖ్యల్లో మర్మమేమిటంటే?

    తెలుగు, తమిళ ఇండస్ట్రీల్లో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న రెజీనా గురించి తెలియని వారుండరు. 1988 డిసెంబర్ 13న రెజీనా చెన్నైలో జన్మించారు. తెలుగులో ‘శివ మనసులో శృతి’ అనే సినిమాతో 2012లో ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత కొత్త జంటతో ఫేమస్ అయింది. రవితేజ లాంటి స్టార్ హీరోలతో నటించిన ఈమె హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాల్లోనూ ఆకట్టుకుంది. ఇక తమిళంలో బిజీ నటిగా మారిపోయిన అమ్మడు ప్రస్తుతం అవకాశాల్లేక ఖాళీగానే ఉంటోంది.

    తాజాగా ఓ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యలో రెజీనా సంచలన కామెంట్స్ చేసింది. తాను చిన్నప్పుడే సినిమాల్లోకి రావాలన్న కోరిక ఉండేది. కానీ ఇండస్ట్రీ గురించి పూర్తిగా తెలియదన్నారు. సినీ హీరోయిన్ గా గ్లామర్ పాత్రలు చేయడమంటే చాలా ఇష్టమని పేర్కొంది. అయితే హద్దులతో మాత్రమే ఒప్పుకుంటానని తెలిపింది. ఈ క్రమంలో కొందరు పోర్న్ స్టార్, హాట్ స్టార్ అంటుంటే విన్నాను. అయితే నేను కూడా సన్నిలియోన్ లాగా పోర్న్ స్టార్ కావాలని కలలు గన్నాను అని పేర్కొన్నారు.

    అయితే పోర్న్ స్టార్ గురించి తెలిసిన తరువాత షాక్ అయ్యాను అని పేర్కొన్నారు. అయితే బోల్డ్ సీన్లు చేయడం కేవలం కల్పితమే. అలాంటప్పుడు అందులో నటించడం పెద్ద తప్పని నేను అనుకోను అని రెజీనా పేర్కొన్నారు. ఇక రెజీనా చేసిన ఈ వ్యాఖ్యలపై కొందరు నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. అవకాశాల కోసమే రెజీనా ఇలాంటి వ్యాఖ్యలు చేసిందని అంటుంటగా.. అసలు విషయం తెలియకనే అలా అన్నారని మరికొందరు అంటున్నారు.