Upasana: మెగాస్టార్ కు వారసుడు రాబోతున్నాడు. చిరంజీవి ఎంతగానో ఎదురుచూస్తున్న తీరని కోరిక తీరబోతుంది. మనవడితో ఆడుకోవాలన్న ఆయన కోరిక నెరవేరబోతోంది. రాంచరణ్ కు పెళ్లి అయ్యి పదేళ్లు అయినా ఇప్పటికీ పిల్లలు లేరు. భార్య ఉపాసన అపోలో ఆస్పత్రిలో బాధ్యతలు, రాంచరణ్ హీరోగా బిజీగా ఉండడంతో వీరిద్దరూ పిల్లలను కనేందుకు ఆసక్తి చూపించలేదు. వృత్తిపరంగా బిజీగా ఇద్దరూ ఉండడంతో వీరు పిల్లలను కనలేదు. వీరితో పెళ్లి అయిన అల్లు అర్జున్, నాని సహా మిగతా హీరోలు ఇద్దరేసి పిల్లలను కన్నారు.

ఈ మధ్యకాలంలో మనవడు కోసం చిరంజీవి, సురేఖ కూడా బాగా ఒత్తిడి తెచ్చినట్టు ఉపాసన తెలిపింది. 10 ఏళ్లు అయినా పిల్లలను కనడం లేదని నిలదీసినట్టు తెలిసింది. ఎంత సంపాదించినా ఏం లాభం పిల్లలు లేకుంటే అని సూటిపోటి మాటలు అన్నీ భరించిన ఉపాసన మొదట ఇది తన వ్యక్తిగత విషయం అని దాటేసింది. చివరకు ఇప్పుడు ఎట్టకేలకు పిల్లలను కనేందుకు రెడీ అయ్యింది.

తాజాగా గణేష్ నిమజ్జనం సందర్భంగా ఉపాసన స్వయంగా తన డ్రైవర్ ఇంటికి ఈ నిమజ్జన కార్యక్రమానికి వెళ్లారు. అక్కడ ఉపాసన బేబీ బంప్ (గర్భం)తో కనిపించడంతో అందరూ ఉపాసన ప్రెగ్నెంటా? అంటూ సందేహాలు వ్యక్తం చేశారు. ఐదారు నెలల గర్భంతో ఉపాసన ఉన్నట్టు తెలుస్తోంది. ఆమె డ్రెస్సింగ్ కూడా లూజ్ గా అలానే ఉండడంతో మెగా ఇంటికి వారసుడు వస్తున్నాడని అందరూ ఆనందంతో సంబంరాలు చేసుకుంటున్నారు. ఉపాసన-రాంచరణ్ లు నిన్న గణేష్ విగ్రహం పట్టుకొని నిమజ్జనోత్సవాల్లో పాల్గొన్నారు. ఆ సమయంలోనే ఉపాసన గర్భంతో ఉన్న ఫొటోలు అందరికీ కనిపించాయి. మెగా ఫ్యామిలీకి త్వరలోనే వారసుడు వస్తున్నాడన్న విషయం లీక్ అయ్యింది.