Babli Bouncer Trailer : రెండు తరాల హీరోలతో రొమాన్స్ చేసి ఇంకా కుర్ర హీరోలరో కూడా రొమాన్స్ చేయడానికి తమన్నా తాపత్రయ పడుతూనే ఉంది. పైగా లేటు వయసులో కూడా బాలీవుడ్ లో పాగా వేయడానికి హద్దులు దాటేస్తోంది. అక్కడ కూడా తన గ్లామర్ మార్క్ ఎలా ఉంటుందో చాలా పచ్చిగా చూపించేస్తోంది. ప్రస్తుతం తమన్నా ప్రధాన పాత్రలో నటించిన కొత్త చిత్రం ‘బబ్లీ బౌన్సర్’.

మధుర్ భండార్కర్ దర్శకత్వంలో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రాబోతుంది. తాజాగా ఈ చిత్రం ట్రైలర్ ను చిత్రబృందం విడుదల చేసింది. ఈ సినిమా కథాంశం కూడా చాలా భిన్నంగా ఉంటుంది. బౌన్సర్లకు కేరాఫ్‌గా ఉన్న ఓ చిన్న పల్లెటూరిలో పుట్టి పెరుగుతుంది తమన్నా. ఐతే, నేపథ్యం కారణంగా కుటుంబ పరిస్థితులు కారణంగా తమన్నా కూడా బౌన్సర్ గానే పెరుగుతుంది.
Also Read: Boycott Brahmastra: రణ్ బీర్, ఆలియా లో బాయ్ కాట్ ఎఫెక్ట్ : 400 కోట్లు వెనక్కి వచ్చేనా?
ఎలాగూ పదో తరగతి కూడా పాస్ కాదు కాబట్టి.. ఆమె కూడా ఇక బౌన్సర్ గానే జీవితం కొనసాగించాల్సి వస్తోంది. ఈ పరిణామాల మధ్య ఉద్యోగం కోసం సిటీకి వస్తోంది. అక్కడ ఆమెకు ఎదురైన సంఘటనలతో ఆమె లేడీ బౌన్సర్‌గా తయారవుతుంది. మొత్తానికి ట్రైలర్‌లో తమన్నా డైలాగ్స్, బౌన్సర్‌గా ఆమె చేసిన ఫైట్లు బాగున్నాయి.

ఇక మాస్ లుక్ లో మిల్కీ బ్యూటీ అదరగొట్టింది. ముఖ్యంగా ట్రైలర్ లో ఒక షాట్ బాగా వైరల్ అవుతుంది. ఇంతకీ ఏమిటి ఆ షాట్ అంటే.. మెడికల్ షాప్ కు వెళ్లిన తమన్నా..ఏమాత్రం బెరుకు లేకుండా ‘‘కండోమ్ ఇవ్వండి’’ అంటూ ఒక లుక్ ఇస్తోంది. మొత్తమ్మీద దమ్మున్న అమ్మాయిగా మల్లయోధురాలిగా, మగవాళ్లకు దీటుగా తమన్నా ఈ సినిమాలో బాగా హైలైట్ అయ్యింది.
Here’s the trailer of film #BabliBouncer @tamannaahspeakshttps://t.co/dfufP7s5Ka#BabliBouncerOnHotstar @DisneyPlusHS from sept 23rd @starstudios_ @JungleePictures
— Madhur Bhandarkar (@imbhandarkar) September 5, 2022