Upasana Kamineni and Janhvi Kapoor : ప్రముఖ హీరోయిన్ శ్రీదేవి కూతురిగా బాలీవుడ్ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి, అనేక సినిమాలు చేసి మంచి పాపులారిటీ ని దక్కించుకున్న జాన్వీ కపూర్(Jhanvi Kapoor), మన టాలీవుడ్ లోకి ‘దేవర'(Devara Movie) చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆమె బాలీవుడ్ లో ఎన్నో సినిమాల్లో నటించి ఉండొచ్చు, కానీ కెరీర్ లో తొలి సక్సెస్ ని రుచి చూసింది మాత్రం ‘దేవర’ తోనే. ఇప్పుడు ఆమె గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Global star Ram charan), బుచ్చి బాబు సన(Buchi Babu Sana) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న #RC16 లో హీరోయిన్ గా నటిస్తుంది. రీసెంట్ గానే ఆమె పుట్టినరోజు సందర్భంగా ఒక షూటింగ్ లొకేషన్స్ లోని ఒక పోస్టర్ ని కూడా విడుదల చేశారు. ఈ సినిమా షూటింగ్ జెట్ స్పీడ్ లో దూసుకుపోతుంది. జాన్వీ కపూర్ కూడా గ్యాప్ లేకుండా షెడ్యూల్స్ లో పాల్గొంటుంది.
Also Read : గోల్డ్ కలర్ డ్రెస్ లో మెరిసిపోతున్న జాన్వీ కపూర్… కుర్రకారు గుండెల్లో సెగలు రేపుతున్న దేవర హీరోయిన్!
అయితే ఈ సినిమా షూటింగ్ బ్రేక్ సమయంలో రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల(Upasana Konidela) జాన్వీ కపూర్ ని కలిసి ఆమెకు విలువైన బహుమతిని అందచేసింది. తన అత్త సురేఖ చేతుల మీదుగా చేసిన వంటకాలతో బిజినెస్ చేస్తున్న సంగతి తెలిసిందే. ‘అత్తమ్మ కిచెన్'(Attamma Kitchen) పేరుతో పాపులర్ అయిన ఈ బిజినెస్ గురించి ఉపాసన తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా ఎన్నో సందర్భాల్లో అభిమానులకు చెప్పుకొచ్చింది. అయితే ఆమె జాన్వీ కపూర్ కోసం ‘అత్తమ్మ కిచెన్’ ద్వారా చేయబడిన స్పెషల్ రెసిపీ ని బహుమతిగా #RC16 లో అందచేసింది. దీనికి సంబంధించిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. జాన్వీ కపూర్ దీనిని తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేయగా, కొంతమంది నెటిజెన్స్ ‘అత్తమ్మ కిచెన్’ కి మంచి పబ్లిసిటీ వచ్చింది అంటూ కామెంట్స్ చేశారు.
ఇకపోతే మూవీ టీం త్వరలోనే ఢిల్లీ షెడ్యూల్ కోసం బయలుదేరనుంది. అక్కడ ప్రధాన తారాగణం పై కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. జమ్మా మస్జీద్ మరియు ఇతర చారిత్రాత్మిక ప్రాంతాలలో ఈ సినిమా షూటింగ్ ని చేయనున్నారు. ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డు గ్రహీత AR రెహమాన్ సంగీతం అందిస్తుండగా, కన్నడ సూపర్ స్టార్స్ లో ఒకరైన శివ రాజ్ కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. గ్రామీణ క్రీడా నేపథ్యం లో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇందులో రామ్ చరణ్ అద్దె ఆటగాడిలా నటించనున్నాడు. అతనికి రాని ఆట అంటూ ఏది లేదు. క్రికెట్, బ్యాడ్ మింటన్, ఫుట్ బాల్, కుస్తీ వంటి ఆటల్లో ప్రావిణ్యం ఉన్న వ్యక్తి గా రామ్ చరణ్ కనిపించనున్నాడు. ఆయనకు గురువు క్యారక్టర్ లో శివ రాజ్ కుమార్ చేస్తున్నాడు. రామ్ చరణ్ అనేక సందర్భాల్లో ఈ చిత్రం నా కెరీర్ లో రంగస్థలం ని మించిన సినిమా అవుతుందని చెప్పుకొచ్చాడు. మరి ఆ రేంజ్ లో ఉంటుందో లేదో చూడాలి.
Also Read : డిప్రెషన్ లో రామ్ చరణ్ భార్య ఉపాసన… ఆమె కామెంట్స్ కి అందరూ షాక్!