https://oktelugu.com/

Upasana Konidela : డిప్రెషన్ లో రామ్ చరణ్ భార్య ఉపాసన… ఆమె కామెంట్స్ కి అందరూ షాక్!

ఇప్పటివరకు క్లింకార ఫేస్ ఉపాసన - రామ్ చరణ్ రివీల్ చేయలేదు. మదర్స్ డే సందర్భంగా క్లీంకార ముఖం సైడ్ నుంచి చూపిస్తూ ఉపాసన ఓ పోస్ట్ పెట్టారు. సదరు పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది. అచ్చం రామ్ చరణ్ లాగే ఉంది అంటూ మెగా ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Written By:
  • NARESH
  • , Updated On : May 14, 2024 / 04:53 PM IST

    Ram Charan's wife Upasana Konidela in depression

    Follow us on

    Upasana Konidela : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన కొణిదెలకు సోషల్ మీడియాలో సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఈ ఏడాది మెగా వారసురాలు క్లింకార కు ఆమె జన్మనిచ్చారు. అయితే సాధారణంగా ప్రతి మహిళా బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత డిప్రెషన్ కు లోనవుతారు. ఉపాసన క్లింకార పుట్టిన తర్వాత తీవ్ర ఒత్తిడికి గురైయారట. ఆ సమయంలో ఆమెకు రామ్ చరణ్ చాలా అండగా నిలిచారని తాజా ఇంటర్వ్యూలో ఉపాసన అన్నారు. నా భర్తే నా థెరపిస్ట్ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

    ఉపాసనా మాట్లాడుతూ .. చాలామంది లాగే నేను కూడా డెలివరీ తర్వాత తీవ్ర ఒత్తిడికి లోనయ్యాను. అప్పుడు చరణ్ నాకు అండగా ఉండేందుకు నాతో పాటు నా పుట్టింటికి వచ్చేశాడు. ఈ అదృష్టం అందరికి ఉండదు. మహిళలందరి విషయంలో ఇలా జరగదు. భార్య తల్లిగా మారే సమయంలో భర్త సపోర్ట్ చాలా అవసరం. క్లింకార విషయంలో చరణ్ చూపించే శ్రద్ధ, ప్రేమ చూస్తుంటే ముచ్చటేస్తుంది. జీవితంలో నేను తల్లిగా ఎదుగుతున్న దశను మరింత సుసంపన్నం చేసినట్లు అనిపిస్తుంది.

    తల్లిగా మారే క్రమంలో ఎన్నో సవాళ్లు ఉంటాయి. కానీ ఇదొక అద్భుతమైన ప్రయాణం. మేము మా పాపను ఇంటి దగ్గర వదిలేసి ఎక్కడికైనా వెళ్లాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు క్లీంకార కంటే ఎక్కువ ఏడుస్తాం. తనను అలా వదిలేయడం మాకెంతో బాధగా ఉంటుందని అన్నారు. రామ్ చరణ్ – ఉపాసన దంపతులు పెళ్లయిన పదేళ్లకు తల్లిదండ్రులు అయ్యారు. క్లింకార మెగా ఫ్యామిలీ లోకి వచ్చిన తర్వాత ఆనందాలు వెల్లివిరిశాయి.

    క్లింకార వచ్చిన వేళా విశేషం మెగా ఫ్యామిలీకి అదృష్టం కలిసొచ్చింది. అల్లు అర్జున్ కు బెస్ట్ యాక్టర్ గా నేషనల్ అవార్డు వచ్చింది. చిరంజీవికి గౌరవ డాక్టరేట్ పద్మవిభూషణ్ అవార్డు దక్కింది. అందుకే క్లీంకార మెగా ఫ్యామిలీ లో చాలా స్పెషల్. అయితే ఇప్పటివరకు క్లింకార ఫేస్ ఉపాసన – రామ్ చరణ్ రివీల్ చేయలేదు. మదర్స్ డే సందర్భంగా క్లీంకార ముఖం సైడ్ నుంచి చూపిస్తూ ఉపాసన ఓ పోస్ట్ పెట్టారు. సదరు పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది. అచ్చం రామ్ చరణ్ లాగే ఉంది అంటూ మెగా ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.