Bigg Boss
Bigg Boss : తెలుగు ప్రేక్షకులు అమితంగా ఇష్టపడే రియాలిటీ షోస్ లో ఒకటి బిగ్ బాస్(Big Boss). ఇప్పటి వరకు ఈ రియాలిటీ షో 8 సీజన్స్ ని పూర్తి చేసుకుంది. మధ్యలో ఒక ఓటీటీ సీజన్ కూడా ఉంది. పాత సీజన్స్ కి సంబంధించిన ఎపిసోడ్స్ ని మనం జియో హాట్ స్టార్(Jio Hotstar) లో చూడొచ్చు. కానీ అందులో కేవలం చివరి మూడు సీజన్స్ మాత్రమే అందుబాటులో ఉంటాయి. అంతకు ముందు అప్లోడ్ అయిన సీజన్స్ అన్ని తొలగించబడ్డాయి. ఇలా కేవలం తెలుగు బిగ్ బాస్ కి మాత్రమే జరుగుతుంది. హిందీ బిగ్ బాస్ లో 4 వ సీజన్ నుండి 18 వ సీజన్ వరకు హాట్ స్టార్ లో అందుబాటులోనే ఉంది. కానీ తెలుగు మాత్రం కేవలం 6వ సీజన్ నుండి మాత్రమే ఎపిసోడ్స్ ఉన్నాయి. ప్రేక్షకులు సీజన్ 4 , సీజన్ 2 ని ఎంతగానో ఇష్టపడుతారు.
Also Read : బిగ్ బాస్ 9 హోస్ట్ గా విజయ్ దేవరకొండ.. తన ఒపీనియన్ చెప్పిన రౌడీ హీరో!
కానీ అవి అందుబాటులో లేవు, ఎక్కడ చూడాలి అనేది కూడా ఆడియన్స్ కి అర్థం కావడం లేదు. అయితే అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం త్వరలోనే ఈ సీజన్స్ అన్ని జియో హాట్ స్టార్ లో అందుబాటులోకి రాబోతున్నట్టు తెలుస్తుంది. డిస్నీ సంస్థతో హాట్ స్టార్ కి ఒప్పందం ఉన్నప్పుడు వేరు, జియో తో ఒప్పందం కుదురించుకున్న తర్వాత లెక్క వేరు. జియో సంస్థ బిగ్ బాస్ కి సంబంధించిన అన్ని సీజన్స్ హాట్ స్టార్ లో ఉండాలని రీసెంట్ గానే ఆదేశాలు జారీ చేసిందట. త్వరలోనే మనమంతా మళ్ళీ పాత సీజన్స్ ని చూడొచ్చు. అయితే ఈ సీజన్స్ ని గతం లో హాట్ స్టార్ నుండి తొలగించడానికి ప్రధాన కారణం స్టార్ మా మ్యూజిక్ ఛానల్ లో భవిష్యత్తులో టెలికాస్ట్ చేయడం కోసమనేనని తెలుస్తుంది .
బిగ్ బాస్ సీజన్ 9 ప్రతీ ఏడాది లాగానే, ఈ ఏడాది కూడా సెప్టెంబర్ నెలలో మొదలు కాబోతుంది. ఈ చిన్న గ్యాప్ లో మే నెల నుండి మినీ ఓటీటీ సీజన్ ని లాంచ్ చేసే ఆలోచనలో బిగ్ బాస్ యాజమాన్యం ఉన్నట్టు తెలుస్తుంది. అయితే సీజన్ 9 ప్రారంభం అయ్యే ముందే బిగ్ బాస్ పాత సీజన్స్ హాట్ స్టార్ లోకి అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని టాక్. చూడాలి మరి ఏమి జరగబోతుందో. మూడవ సీజన్ నుండి 8 వ సీజన్ వరకు అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna) హోస్ట్ గా వ్యవహరించాడు. కానీ 9 వ సీజన్ కి మాత్రం ఆయన అందుబాటులో ఉండే అవకాశం లేదని లేటెస్ట్ గా వినిపిస్తున్న వార్త. విజయ్ దేవరకొండ(Vijay Devarakonda), లేదా రానా దగ్గుబాటి(Rana Daggubati) ఈ సీజన్ కి హోస్ట్ గా వ్యవహరించే అవకాశాలు ఉన్నాయి. ఈ సీజన్ లో పాల్గొనే కంటెస్టెంట్స్ విషయంలో కూడా అత్యంత జాగ్రత్తలు తీసుకున్నట్టు తెలుస్తుంది.
Also Read : బిగ్ బాస్ తెలుగు 9, కన్ఫర్మ్ అయిన ఫస్ట్ 6 కంటెస్టెంట్స్ వీరే? ఇక హౌస్లో రచ్చే