https://oktelugu.com/

Upasana Konidela : సురేఖ మీద అంజనా దేవికి ఉపాసన ఫిర్యాదులు… వీడియో వైరల్!

'' లివింగ్ రూమ్ కిచెన్ గా మారితే ఇలా ఉంటుంది. అంజనాదేవి పర్యవేక్షణలో కొత్త ఆవకాయ చేస్తున్నాము. మీరు కూడా అత్తమాస్ కిచెన్ అవకాయని రుచి చూడాలని అనుకుంటున్నారా '' అని క్యాప్షన్ లో రాసుకొచ్చింది ఉపాసన కొణిదెల. సురేఖ, ఉపాసన ప్రమోషనల్ టెక్నీక్స్ చూసి జనాలు వాపోతున్నారు.

Written By:
  • NARESH
  • , Updated On : April 20, 2024 / 09:26 PM IST

    Upasana Konidela

    Follow us on

    Upasana Konidela : ఇటీవల చిరంజీవి సతీమణి సురేఖ కొణిదెల కోడలు ఉపాసనతో కలిసి కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. ‘ అత్తమ్మాస్ కిచెన్ ‘ పేరుతో ఆన్లైన్ ఫుడ్ బిజినెస్ మొదలు పెట్టారు. ఈ నేపథ్యంలో సురేఖ ఆవకాయ పచ్చడి పడుతున్న వీడియో నెట్టింట వైరల్ గా మారింది. దీనికి సంబంధించిన ఓ ఫన్నీ వీడియో ఉపాసన షేర్ చేశారు. సమ్మర్ సీజన్ అంటే మనకు ఎక్కువగా గుర్తొచ్చేది మామిడి కాయలు. ఎండాకాలంలో తాజాగా దొరికే పచ్చి మామిడి కాయలతో ఆవకాయ పట్టుకుంటూ ఉంటారు.

    ఈ నేపథ్యంలో నోరూరించే మామిడి కాయ పచ్చడి సురేఖ స్వయంగా తయారు చేస్తున్నారు. అయితే వారు గతంలో ఇంటి వంటకాలను తలపించేలా వారి భోజనం ఉంటుంది అని చెప్పారు. ముఖ్యంగా చదువు, ఉద్యోగ రీత్యా ఇతర కారణాల వలన ఇంటి భోజనం మిస్ అవుతున్న వారికి ఆ లోటు ‘ అత్తమ్మాస్ కిచెన్ ‘ తీరుస్తుంది అని చెప్పుకొచ్చారు. ఇంట్లో చేసుకునే వంటలు వారి ప్రొడక్ట్స్ లో భాగమని తెలియజేశారు. ఇక చెప్పిన విధంగా ఆన్లైన్ లో రుచికరమైన ఇంటి భోజనం అందిస్తున్నారు.

    అయితే తాజాగా ఉపాసన షేర్ చేసిన వీడియోలో .. సురేఖ అంజనా దేవి ఆధ్వర్యంలో పచ్చడి కలుపుతూ కనిపించరు. ఇంతలో ఉపాసన .. ఏంటి నానమ్మ కోపంగా ఉన్నారు అని అడగ్గా .. అలా ఏమి లేదు ఊరికే అలా కూర్చున్నా అని బదులిచ్చారు. మీ కోడలు సరిగా పని చేయడం లేదా అని ఉపాసన సరదాగా అంజనాదేవితో అన్నారు. ఇక ఉపాసన సురేఖ ని క్యూట్ గా ‘ క్యా హోరా’ అత్తమ్మ అని అంటుంది. అయితే ఈ వీడియో ప్రస్తుతం బాగానే ట్రెండ్ అవుతుంది.

    ” లివింగ్ రూమ్ కిచెన్ గా మారితే ఇలా ఉంటుంది. అంజనాదేవి పర్యవేక్షణలో కొత్త ఆవకాయ చేస్తున్నాము. మీరు కూడా అత్తమాస్ కిచెన్ అవకాయని రుచి చూడాలని అనుకుంటున్నారా ” అని క్యాప్షన్ లో రాసుకొచ్చింది ఉపాసన కొణిదెల. సురేఖ, ఉపాసన ప్రమోషనల్ టెక్నీక్స్ చూసి జనాలు వాపోతున్నారు.