Unstoppable With NBK Season 2: తెలుగు నంబర్ వన్ టాక్ షో అన్ స్టాపబుల్ సీజన్——2 ప్రారంభం అదిరింది. తొలి గెస్ట్ గా చంద్రబాబు, హోస్ట్ గా బాలక్రిష్ణ ఉండడంతో అంచనాలు పెరిగాయి. దానికి తగ్గట్టుగానే ప్రోమో ఉండడంతో అంచనాలు మరింత రెట్టింపు అయ్యాయి. ఎప్పుడు సీరియస్ గా కనిపించే చంద్రబాబు మనసారా నవ్వుతూ కనిపించారు. బావమరిదితో బావోద్వేగాలను పంచుకున్నారు. ఎప్పటి నుంచో సమాధానం లేని కొన్ని ప్రశ్నలకు చంద్రబాబు, అటు బాలక్రిష్ణ వివరణ ఇచ్చారు. 1995 ఎపిసోడ్ విషయాలను ప్రస్తావించారు. నాడు ఎన్టీఆర్ ను గద్దె దింపిచంద్రబాబును సీఎం చేయడానికి గల కారణాలేమిటి? తండ్రి ఎన్టీఆర్ ను కాదని నందమూరి వారసులు చంద్రబాబు పక్షాన నిలవడానికి గలపరిస్థితులపై చంద్రబాబు, బాలక్రిష్ణలు వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. నాటి గురుతులను నెమరువేసుకుంటూ కన్నీటి పర్యంతమయ్యారు.

అటు దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డితో చంద్రబాబుకు ఉన్న శత్రుత్వమేమిటి? వారి మధ్య రాజకీయ వైరం ఎప్పటి నుంచి ప్రారంభమైంది. అంతకంటే ముందు వారి మధ్య ఫ్రెండ్ షిప్ ఏ రేంజ్ లో ఉండేది. వారి చేసిన అల్లరి పనులు ఏమిటి? స్నేహితులుగా ఉన్నవారు సడన్ గా బద్ధ శత్రువులుగా మారడానికి కారణాలేమిటి? నాడు అలిపిరిలో చంద్రబాబుపై నక్సలైట్లు దాడిచేసినప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి పడిన బాధ తదితర విషయాలను బాలక్రిష్ణ చంద్రబాబుతో చెప్పించే ప్రయత్నం చేశారు. అయితే టాక్ షోలో ప్రతీ అంశం మనసుకు నచ్చేలా.. ఎన్నో సంవత్సరాలుగా సశేషంగా ఉన్న కొన్ని ప్రశ్నలకు మాత్రం చంద్రబాబు నివృత్తి చేసే ప్రయత్నం చేశారు. అయితే ఇది జస్ట్ ప్రోమో మాత్రమే. ఈ నెల 14న టాక్ షో ఎపిసోడ్ టెలికాస్టవుతుంది. అందులో చాలా విషయాలకు చంద్రబాబు వివరణ ఇవ్వనున్నారు. అయితే చంద్రబాబు ఏమేమి చెప్పారన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రోమో బయటకు వచ్చిన తరువాత పూర్తిస్థాయి ఎపిసోడ్ ఎప్పుడు టెలికాస్టవుతుందా అని ఆతృతగా ఎదురుచూసే వారి సంఖ్య మాత్రం పెరుగుతుంది. అంతల ఉంది ప్రోమా ఎఫెక్ట్.
షోలో నారా లోకేష్ ఎంట్రీ కూడా అదిరిపడింది. వస్తూవస్తూనే లోకేష్ ను బాలక్రిష్ణ ఆటపట్టించిన తీరు కూడా ఆకట్టుకుంది. ఒక వైపు తండ్రి, మరోవైపు పిల్లకిచ్చిన మామ ఉండగానే లోకేష్ విదేశీ బామలతో స్విమ్మింగ్ ఫుల్ లో దిగిన ఫొటో ఒకటి ప్రత్యక్షమైంది. దానిని చూసి చంద్రబాబు షాక్ కు గురయ్యారు. ఫొటోపై బాలక్రిష్ణ అభిప్రాయం కోరగా చంద్రబాబు చమత్కారంగా కామెంట్స్ చేశారు. అటు అల్లుడు లోకేష్ రాజకీయ మైనస్ లను సైతం బాలక్రిష్ణ ప్రస్తావించారు. ఇక లోకేష్ కూడా వీరవిహారం చేశాడు. కాసేపు మామ బాలక్రిష్ణ హోస్ట్ స్థానంలో కూర్చొని బాలక్రిష్ణకు చమత్కారంతో కూడిన ప్రశ్నలు సంధించారు. ఆసక్తికరమైన ప్రశ్నలు వేసి బాలయ్య నుంచి సమాధానలు రాబెట్టే ప్రయత్నం చేశారు.

మొత్తానికైతే అన్ స్టాపబుల్ రెండో సీజన్ ఫస్ట్ ప్రోమో మాత్రం దద్దరిల్లింది. తొలి ఎపిసోడే మైండ్ బ్లాక్ అయ్యేలా కనిపిస్తోంది. సీజన్ 2 మామ్మూలుగా ఉండదని వీక్షకులకు గట్టి సంకేతాలే పంపారు. అటు అంచనాలు పెంచడంలో అటు బాలక్రిష్ణ, ఆహా టీమ్ సక్సెస్ అయ్యింది. ప్రస్తుతానికైతే ప్రమో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అయితే ఆన్ స్టాపబుల్ ఫస్ట్ ఎపిసోడ్ తెలుగుదేశం పార్టీ సంక్షోభాలు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు మధ్య రాజకీయ పరిణామాలు, లోకేష్ రాజకీయ పరిణితి వంటి వాటిని హైప్ చేస్తుందని మాత్రం తెలుస్తోంది. ఫస్ట్ ఎపిసోడ్ టెలికాస్ట్ కాక మునుపే తరువాత ఎపిసోడ్ లకు వచ్చే గెస్టులపై తెలుగునాట చర్చలు పెరుగుతున్నాయి.