Unstoppable With NBK Season 2: బాలయ్య ఓటీటీ షో #Unstoppable 2 సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతుంది. రాజకీయ, సినీ సెలబ్రెటీలు వచ్చి సందడి చేస్తున్న ఈ షో ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. సెప్టెంబర్ లో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అయినప్పటి నుంచి షో కు మరింత ఊపు వచ్చింది. #Unstoppable 2 మొదటి ఎపిసోడ్ లో మాజీ సీఎం చంద్రబాబు నాయుడు వచ్చి ఆశ్చర్యపరిచారు. ఆ తరువాత రెండో ఎపిసోడ్ లో విశ్వక్ సేన్, సిద్దు జొన్నలగడ్డ వచ్చి అలరించారు. అయితే మూడో ఎపిసోడ్ లో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇప్పుడు మరో ఎపిసోడ్ కు బాలయ్య ప్రేక్షకులకు ఊహించని షాక్ ఇవ్వబోతున్నాడు. ఈసారి మాజీ హీరోయిన్ ను తీసుకొచ్చే ప్రయత్నం లో ఉన్నారు. ఇంతకీ ఆమె ఎవరో తెలుసుకోవాలని ఉందా..?

సినిమాల్లోనే కాకుండా #Unstoppable కు హోస్ట్ గా బాలయ్య ఆకట్టుకుంటున్నారు. తన చాకచక్యం మాటలతో ఎదుటివారిని ఇంప్రెస్ చేసి వారి పర్సనల్ విషయాలను బయటపెడుతున్నారు. అవసరమైన కుర్ర హీరోలతో డ్యాన్స్ చేస్తూ బాలయ్య ప్రత్యేకంగా నిలుస్తున్నారు.దీంతో ఈ షో కు మరింత క్రేజ్ పెరిగింది. ఈ నేపథ్యంలో కొందరు నటులు #Unstoppable షో కు రావాలని ఇంట్రెస్ట్ పెడుతున్నారు. అయితే పక్కా ప్రణాళికతో బాలకృష్ణ బిగ్ సెలబ్రెటీలను ఆహ్వానిస్తున్నారు. అంతేకాకుండా ఆడియన్స్ కు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు.
ఈ నేపథ్యంలో తాజా ఎపిసోడ్ కు మాజీ హీరోయిన్ ను తీసుకొస్తున్నట్లు సమాచారం. ఆమె ఎవరో కాదు. ఒకప్పటి స్టార్ హీరోయిన్ రాధిక. సౌత్ సూపర్ స్టార్ హీరోయిన్ గా పేరొందిన రాధిక ప్రస్తుతం కొన్ని సినిమాల్లో సైడ్ రోల్స్ చేస్తోంది. ఒకప్పుడు ఆమె స్టార్ హీరోలందరితో నటించింది. బాలయ్యతో కూడా పలు సినిమాల్లో కనిపించింది.. అయితే రాధికను ఈ షో కు తీసుకురావడం వల్ల తెలుగు, తమిళ ఇండస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకోవాలని చూస్తున్నారు.

అయితే రాధికను పలు ప్రశ్నలు అడిగే అవకాశం ఉందని అంటున్నారు. ఆమెతో చేసిన సినిమాల గురించి మాట్లాడే అవకాశం ఉందని అంటున్నారు. అలాగే ఆమె పర్సనల్ విషయాలపై కూడా ఫోకస్ పెట్టనున్నారు. ఆమె మూడు పెళ్లిళ్లు చేసుకున్న విషయం తెలిసిందే. ఆ విషయం కూడా బాలయ్య అడుగుతారని అంటున్నారు. అయితే రాధిక తో ఉండే #Unstoppable కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.