https://oktelugu.com/

Unstoppable: సుకుమార్​- బాలయ్య కాంబోలో సినిమా?.. పుష్ప టీమ్​తో ‘అన్​స్టాపబుల్’​ సందడి

Unstoppable: నందమూరి బాలకృష్ణ హోస్ట్​గా ఆహా వేదికగా సందడి చేస్తున్న షో అన్​స్టాపబుల్​ విత్ ఎన్బీకే. ఇప్పటికే వచ్చిన ఎపిసోడ్స్​లో బాలయ్య సందడి మాములుగా లేదు. ఓ వైపు చమత్కారంగా గెస్ట్​లతో మాట్లాడుతూనే.. మరోవైపు ప్రశ్నలు వేస్తూ ఆసక్తికర సమాధానాలు రప్పిస్తూ.. ప్రేక్షకులను అలరిస్తున్నారు. అఖండతో భారీ హిట్​ అందుకున్న బాలయ్య.. ఈషోతో మరింత జోష్​ను క్రియేట్ చేశారు. కాగా, తాజాగా ఎపిసోడ్ 6లో పుష్ప టీమ్​ ఈ షోకు గెస్ట్​గా వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 28, 2021 / 10:43 AM IST
    Follow us on

    Unstoppable: నందమూరి బాలకృష్ణ హోస్ట్​గా ఆహా వేదికగా సందడి చేస్తున్న షో అన్​స్టాపబుల్​ విత్ ఎన్బీకే. ఇప్పటికే వచ్చిన ఎపిసోడ్స్​లో బాలయ్య సందడి మాములుగా లేదు. ఓ వైపు చమత్కారంగా గెస్ట్​లతో మాట్లాడుతూనే.. మరోవైపు ప్రశ్నలు వేస్తూ ఆసక్తికర సమాధానాలు రప్పిస్తూ.. ప్రేక్షకులను అలరిస్తున్నారు. అఖండతో భారీ హిట్​ అందుకున్న బాలయ్య.. ఈషోతో మరింత జోష్​ను క్రియేట్ చేశారు. కాగా, తాజాగా ఎపిసోడ్ 6లో పుష్ప టీమ్​ ఈ షోకు గెస్ట్​గా వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా స్ట్రీమింగ్​ అయిన ఈ ఎపిసోడ్​లో డైరెక్టర్​ సుకుమార్​తో పాటు, రష్మిక, బన్నీ హాజరై అలరించారు. 47 నిమిషాల పాటు సాగిన ఈ ఎపిసోడ్​ ఎంతో సందడిగా సాగింది.

    Unstoppable

    కాగా, ఈ ఎపిసోడ్​లో బన్నీ, సుకుమార్​ మధ్య మంచ ఫన్నీ కన్వర్జేషన్ జరిగింది. వీరిద్దరు కలిసి చేసిన సందడి మునుపడి ఎపిసోడ్స్ కంటే మరింత ఎనర్జీ ఇచ్చింది. సూకుమార్​తో తన సినిమా గురించి బాలయ్య మాట్లాడుతూ.. దసరాకి కొబ్బరికాయ.. క్రిస్మస్​కు గుమ్మడికాయ.. సంక్రాంతికి రిలీజ్​ అంటూ సరదాగా బాలయ్య అనేశారు. ఈ క్రమంలోనే వీరిద్దరి కాంబోలో సినిమా రానుందనే అంచనాలు రేకెత్తాయి.

    Also Read: Akhanda 25 Days Collections: అఖండ 25 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ !

    ఈ క్రమంలోనే తన మైనస్​ పాయింట్​ కన్​ఫ్యూజ్​ అని సుకుమార్​ నిజాయితీగా చెప్పడం అందర్నీ ఆకట్టుకుంది. సినిమాల్లో ఐటెం సాంగ్స్​కు ఎందుకంత ప్రాధాన్యం ఇస్తారో కూడా ఈ ఎపిసోడ్​లో తెలియజేశారు సుకుమార్​. దీంతో పాటు, తనకు తన కథే శత్రువు, మిత్రుడు అని సుకుమార్ చెప్పడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇలా న్యూయర్ సందడినంతా ముందే బాలయ్య తన షోతో రప్పించనట్లుంది. మరెందుకు ఆలస్యం మీరు కూడా ఆహాకు ట్యూన్ అయ్యి బాలయ్య షోను ఎంజాయ్ చేయండి.

    Also Read: Samantha: బికినీలో హాట్​లుక్స్​తో కవ్విస్తోన్న సమంత.. గోవా టూర్​లో ఎంజాయ్​