https://oktelugu.com/

Tollywood Hits in 2021: 2021 రౌండప్, ఏడాది ముగింపులో హ్యాట్రిక్ విజయాలు !

Tollywood Hits in 2021: ఈ కరోనా వచ్చిన దగ్గర నుంచీ సినిమా రంగానికి అంతా చేదు జ్ఞాప‌కాలే అన్నట్టు ఉంది వ్యవహారం. ఈ 2021లో కూడా దాదాపు స‌గం రోజులు థియేట‌ర్లు మూసుకోవాల్సి వచ్చింది. తెర‌చుకునే సమయానికి జగన్ బాబులోని పైత్యం పరాకాష్టకు చేరింది. ఏది ఏమైనా మధ్యలో తెరుచుకున్న కొన్నాళ్ళు కూడా 50 శాతం ఆక్యుపెన్సీతో ఎలాగోలా బాక్సాఫీస్ వద్ద నెట్టుకు రావాల్సిన పరిస్థితి కనిపించింది. ఇన్నీ గండాల మధ్య కూడా చిత్ర‌సీమ‌ తట్టుకుని […]

Written By:
  • Shiva
  • , Updated On : December 28, 2021 / 10:43 AM IST
    Follow us on

    Tollywood Hits in 2021: ఈ కరోనా వచ్చిన దగ్గర నుంచీ సినిమా రంగానికి అంతా చేదు జ్ఞాప‌కాలే అన్నట్టు ఉంది వ్యవహారం. ఈ 2021లో కూడా దాదాపు స‌గం రోజులు థియేట‌ర్లు మూసుకోవాల్సి వచ్చింది. తెర‌చుకునే సమయానికి జగన్ బాబులోని పైత్యం పరాకాష్టకు చేరింది. ఏది ఏమైనా మధ్యలో తెరుచుకున్న కొన్నాళ్ళు కూడా 50 శాతం ఆక్యుపెన్సీతో ఎలాగోలా బాక్సాఫీస్ వద్ద నెట్టుకు రావాల్సిన పరిస్థితి కనిపించింది.

    Tollywood Hits in 2021

    ఇన్నీ గండాల మధ్య కూడా చిత్ర‌సీమ‌ తట్టుకుని నిలబడింది. అయితే, ఏపీలో టికెట్ రేట్లు త‌గ్గించ‌డం అనే విషయంలో మాత్రం ఇండస్ట్రీ జీర్ణయించుకోలేకపోతుంది. అసలు కొన్ని థియేట‌ర్ల‌లో పాప్ కార్న్ కంటే సినిమా టికెట్ చీప్ అవ్వడం ఏమిటి ? ఈ రోజుల్లో ‘టీ టైం’ లాంటి టీ షాప్ ల్లో టీ కూడా 35 రూపాయలకు అమ్ముతున్నారు.

    Also Read: Unstoppable: సుకుమార్​- బాలయ్య కాంబోలో సినిమా?.. పుష్ప టీమ్​తో ‘అన్​స్టాపబుల్’​ సందడి

    అలాంటిది సినిమా టికెట్ టికెట్లను కేవలం 10 రూపాయలకు, 20 రూపాయలకు అమ్మడం విడ్డూరంగానే ఉంది. ఏది ఏమైనా ఇప్పటికే కొన్ని థియేట‌ర్ల‌కు తాళాలు ప‌డిపోయాయి. నిబంధ‌న‌లు ఎక్కువైపోయాయి. వీటి మధ్య థియేటర్స్ ను నడపడం కష్టం అనే అభిప్రాయానికి వచ్చేశారు థియేటర్ల యాజమాన్యం. అసలుకే వ‌రుస ప‌రాజ‌యాలు, మరోపక్క ప్రభుత్వం పొగరు.. మొత్తమ్మీద ఈ అంశాలన్నీ చిత్ర‌సీమ‌ని బాగా కృంగ‌దీశాయి.

    అయితే, ఎంత అమావాస్య అయినా.. ఎక్కడో ఏ మెరుపు చుక్కో.. ఏ మిణుగురు పురుగో వెలుగులు చిమ్ముతూ ఉంటుంది కదా. అలాగే ఈ క్లిష్ట‌మైన ప‌రిస్థితుల్లో అనగా డిసెంబ‌ర్ లో తెలుగు సినిమాకు ఊపు వచ్చింది. ఈ నెల‌లో విడుద‌లైన మూడు సినిమాలు సూప‌ర్ హిట్ అయ్యాయి. వ‌సూళ్ల పరంగా కూడా రికార్డ్స్ స్థాయి కలెక్షన్స్ ను రాబట్టాయి.

    దాంతో ఈ డిసెంబ‌ర్ టాలీవుడ్‌కి ఊపిరినిచ్చింది. ఈ నెలలో వచ్చిన బాలయ్య – బోయపాటి ‘అఖండ‌’ టాలీవుడ్ కి మ‌ర్చిపోలేని విజ‌యాన్ని ఇచ్చి ఆశలు రేకెత్తించింది. హౌస్ ఫుల్‌ క‌ల‌క్ష‌న్ల‌తో థియేటర్స్ ను హోరెత్తించింది. రికార్డుల‌న్నీ అఖండ తిర‌గ‌రాసింది. అటు ఓవ‌ర్సీస్ లోనూ డాల‌ర్ల వ‌ర్షం కురిశాయి.

    ఇక పుష్ప‌ కూడా త‌న ప్రభవాన్ని బాగా చూపించింది. ఇక ఇటు శ్యామ్ సింగ‌రాయ్ కూడా హిట్ టాక్ తెచ్చుకుని బాగానే వసూలు చేస్తోంది. ఈ డిసెంబ‌రు 2021కి ఘ‌నంగా వీడ్కోలు పలికినట్టే.

    Also Read: Pushpa Collections: ‘పుష్ప’ 5 రోజుల బాక్సాఫీస్ ఫుల్ కలెక్షన్స్ ఇవే !

    Tags