https://oktelugu.com/

Samantha: సమంత “యశోద” సినిమాలో అనుష్క హీరో… ఉన్ని ముకుందన్

Samantha: సమంత ప్రధాన పాత్రలో శ్రీదేవి మూవీస్‌ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్‌ నిర్మిస్తున్న థ్రిల్లర్ సినిమా ‘యశోద’. తెలుగు సహా దక్షిణాది భాషలు తమిళం, కన్నడ, మలయాళంతో పాటు హిందీలో ‘యశోద’ సినిమాను తెరకెక్కిస్తున్నారు. దీంతో హరి, హరీష్ అనే ఇద్దరు యువకులు దర్శకులుగా పరిచయం అవుతున్నారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. సమంత ఇంతకు ముందెన్నడూ నటించ నటువంటి పాత్రను మా సినిమాలో పోషిస్తున్నారు అని నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ అన్నారు. ‘యశోద’ పక్కా […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 20, 2021 / 07:18 PM IST
    Follow us on

    Samantha: సమంత ప్రధాన పాత్రలో శ్రీదేవి మూవీస్‌ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్‌ నిర్మిస్తున్న థ్రిల్లర్ సినిమా ‘యశోద’. తెలుగు సహా దక్షిణాది భాషలు తమిళం, కన్నడ, మలయాళంతో పాటు హిందీలో ‘యశోద’ సినిమాను తెరకెక్కిస్తున్నారు. దీంతో హరి, హరీష్ అనే ఇద్దరు యువకులు దర్శకులుగా పరిచయం అవుతున్నారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. సమంత ఇంతకు ముందెన్నడూ నటించ నటువంటి పాత్రను మా సినిమాలో పోషిస్తున్నారు అని నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ అన్నారు. ‘యశోద’ పక్కా థ్రిల్లర్ సినిమా అని… మధుబాల పాత్రలో వ‌ర‌లక్ష్మీ శ‌ర‌త్ కుమార్, మరో ప్రధాన పాత్రలో ఉన్ని ముకుందన్ నటిస్తున్నారు అని ఆయన తెలిపారు.

    సమంత, ఉన్ని ముకుందన్ కలయికలో రెండో చిత్రమిది. ఇంతకు ముందు వీళ్లిద్దరూ ‘జనతా గ్యారేజ్’లో కలిసి నటించారు. అందులో మోహన్ లాల్ కుమారుడిగా ఉన్ని ముకుందన్ కనిపించారు. మరి, ఈ సినిమాలో ఆయన పాత్ర ఎలా ఉంటుందో చూడాలి. ప్రస్తుతం హైదరాబాద్ సిటీలో చిత్రీకరణ జరుగుతోంది. మరో రెండు మూడు రోజుల్లో అది పూర్తి అవుతుంది. ఆ తర్వాత జనవరి 3 నుంచి రెండో షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది. మార్చికి షూటింగ్ అంతా పూర్తి చేస్తాం” అని చెప్పారు. ఈ చిత్రానికి రామజోగయ్య శాస్త్రి పాటలు అందిస్తుండగా… పులగం చిన్నారాయణ, డా. చల్లా భాగ్యలక్ష్మి మాటలు రాశారు. ‘శాకుంతలం’లోనూ మలయాళ నటుడు దేవ్ మోహన్‌తో సమంత నటించారు. బ్యాక్ టు బ్యాక్… రెండు సినిమాల్లో మలయాళ నటులతో సమంత స్క్రీన్ షేర్ చేసుకోనుండటం యాదృశ్చికమే. ఇంతకు ముందు అనుష్కకు జోడీగా ఆయన ‘భాగమతి’ సినిమాలో ఉన్ని ముకుందన్ నటించిన సంగతి తెలిసిందే.