
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ ఫుత్ ఆత్మహత్య కేసు మిస్టరీగా మారింది. ఈ కేసు అనేక మలుపులు తిరుగుతూ బాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. డ్రగ్స్ మాఫియాతో బాలీవుడ్లోని ప్రముఖులకు లింకులు బయట పడుతుతున్నారు. ఇప్పటికే ఈ కేసులో పలువురిని అరెస్టు చేసిన పోలీసులు సంచలన విషయాలను వెల్లడిస్తున్నారు.
Also Read : మెగా బ్రదర్ నాగబాబుకు కరోనా సోకిందా?
సుశాంత్ మాజీ ప్రియురాలు రియా చక్రవర్తి డ్రగ్స్ కేసులో పూర్తిగా ఇరుక్కుపోయారు. రియాతోపాటు ఆమె సోదరుడు షోవిక్, డ్రగ్ డీలర్ బాసిత్ లను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. మూడ్రోజులపాటు రియా చక్రవర్తిని పోలీసులు విచారించి అనేక కీలక విషయాలను తెలుసుకున్నారు. డ్రగ్స్ కేసుతో సంబంధం ఉన్న 25మంది సెలబ్రెటీల పేర్లను రియా పోలీసులకు వెల్లడించినట్లు తెలుస్తోంది. ఈ తంతంగం మొత్తం ఎవరు నడిపించారనే చర్చ బాలీవుడ్లో జోరుగా నడుస్తోంది.
బాలీవుడ్లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ గా ఉన్న ఓ స్టార్ హీరోకు ఎప్పటి నుంచో డ్రగ్ మాఫియాతో సంబంధం ఉన్నట్లు చర్చ జరుగుతోంది. బాలీవుడ్లో డ్రగ్స్ సరఫరాకు ఆయనే ప్రధాన కారణమని ఫిల్మ్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. డ్రగ్స్ డీలర్స్ తో సంబంధం కొనసాగిస్తూ గుట్టుచప్పుడు కాకుండా తారలకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నారు. ఎన్సీబీ అధికారులు ఆ స్టార్ హీరోకు నార్కో అనాలిసిస్ టెస్ట్ చేస్తే మరిన్ని నిజాలు బయటికి వస్తాయనే టాక్ విన్పిస్తోంది.
అయితే మరికొందరు మాత్రం రియా చక్రవర్తి స్టార్ హీరోల పేర్లను వెల్లడించలేదని చర్చించుకుంటున్నారు. ఆమె కేవలం డ్రగ్స్ సంబంధం ఉన్న డ్రగ్స్ డీలర్ల పేర్లను మాత్రమే వెల్లడించిందని అంటున్నారు. ఈ విషయం ఎలా ఉన్నా డ్రగ్స్ కేసులో ఆ ప్రముఖ హీరో పేరు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ కేసులో రోజుకో విషయం వెలుగు చూస్తూ బాలీవుడ్లోని సెలబ్రెటీలు ఆందోళన చెందుతున్నారు.