https://oktelugu.com/

సార్ ఇంకా సమాధిలోనే ఉన్నారు !

సూపర్ స్టార్ కృష్ణ ‘కొత్త కాపురం’ అనే సినిమా చేయడానికి సన్నద్ధం అయ్యారు. అయితే, ఆ సినిమాలో హీరోయిన్‌ తండ్రి పాత్ర కీలకమైనది. కాబట్టి.. ఆ పాత్రకు ఎస్‌.వి. రంగారావుగారు అయితేనే న్యాయం జరుగుతుంది అని భావించారు కృష్ణ. అప్పటికే ఎస్వీయార్ మద్యపానానికి బానిస అయ్యారు. కానీ కృష్ణగారు మాత్రం ఎస్వీఆర్ నే బుక్ చేయండి అని దర్శకనిర్మాతలకు ఆర్డర్స్ పాస్ చేశాడు. కారణం కృష్ణ మంచితనమే. ‘నా తర్వాత చిత్రంలో మీకు కీలక పాత్రతో పాటు […]

Written By:
  • admin
  • , Updated On : July 12, 2021 / 04:22 PM IST
    Follow us on

    సూపర్ స్టార్ కృష్ణ ‘కొత్త కాపురం’ అనే సినిమా చేయడానికి సన్నద్ధం అయ్యారు. అయితే, ఆ సినిమాలో హీరోయిన్‌ తండ్రి పాత్ర కీలకమైనది. కాబట్టి.. ఆ పాత్రకు ఎస్‌.వి. రంగారావుగారు అయితేనే న్యాయం జరుగుతుంది అని భావించారు కృష్ణ. అప్పటికే ఎస్వీయార్ మద్యపానానికి బానిస అయ్యారు. కానీ కృష్ణగారు మాత్రం ఎస్వీఆర్ నే బుక్ చేయండి అని దర్శకనిర్మాతలకు ఆర్డర్స్ పాస్ చేశాడు. కారణం కృష్ణ మంచితనమే.

    ‘నా తర్వాత చిత్రంలో మీకు కీలక పాత్రతో పాటు భారీ రెమ్యునరేషన్ ను ఇప్పిస్తాను’ అని కృష్ణ మాట ఇచ్చారట. ఆ మాట ప్రకారమే ఎస్వీఆర్ కి కొత్త కాపురం సినిమాలో ఛాన్స్ వచ్చేలా చేశారు. కానీ, ఎస్వీయార్ బలహీనత అప్పటికే పరిధి దాటి పోయింది. ఆయన ఒక్కోసారి షూటింగ్స్‌ వదిలేసి, తన తోటకు వెళ్లి పదిహేను రోజులు పాటు ఏకధాటిగా తాగుతూ ఉండేవారు.

    ఆ తోట నుండి ఎస్వీఆర్ అడుగు బయటకు పెట్టేవారు కాదు. ఒకవేళ నిర్మాతలు గానీ, దర్శకులు గానీ ఆయన కోసం వెళ్తే.. ‘గురువుగారు ఇంకా సమాధిలోనే ఉన్నారు సార్’ అంటూ ఆయన డ్రైవర్ భయపడుతూ చెప్పేవాడు. సమాధి అంటే తాగుడు వ్యవహారం అన్నమాట. మరి ఆయన ఎప్పుడు బయటకు వస్తారు ?.. ఏమో ఎవరు చెప్పలేరు. ఎస్వీఆర్ దగ్గరకు వెళ్లి ‘ఏమిటి ఇది ?’ అని ప్రశ్నించే ధైర్యం ఆ రోజుల్లో ఎవరికీ లేదు.

    కారణం ఒక్కటే.. ఎస్వీఆర్ అంటే.. ఎన్టీఆర్ కి, ఏఎన్నార్ కి గౌరవం. ఆయనకు అవమానం జరిగితే, అది తమకు జరిగినట్టుగానే వారు భావించేవారు. అందుకే నిర్మాతలంతా ఎస్వీఆర్ కోసం ఓపికగా ఎదురు చూసేవారు తప్ప, ఆయన పై ఎప్పుడు చిరాకు కూడా చూపించేవారు కాదు. ఇలాంటి పరిస్థితుల్లో ‘కొత్త కాపురం’లో ఎస్వీఆర్ ను తీసుకున్నారు.

    అందరూ భయపడుతున్న విధంగానే షూటింగ్‌ జరుగుతున్నప్పుడే రంగారావుగారు తన తోటకు వెళ్లారు. కట్ చేస్తే.. ఐదు రోజులు గడిచాయి. ఇక షూట్ అప్పాల్సిన పరిస్థితి. ఇక మిగిలింది మొత్తం కాంబినేషన్ సీన్సే. దాంతో ఎన్నిసార్లు తోటకు వెళ్లి అడిగినా ‘సర్ ఇంకా సమాధిలోనే ఉన్నారండీ’ అంటూ సమాధానం వచ్చేది. పాపం అయినా ఆ సినిమా నిర్మాత వెంకటరత్నం, రంగారావు దగ్గరకు వెళ్లి షూటింగ్‌ కు రమ్మని రోజూ బతిమాలేవారు.

    దాంతో జాలిపడిన ఎస్వీయార్ షూట్ కి వచ్చి, ఆ తర్వాత ఎంతో సహకరించారు. సినిమా సగానికి పైగా పూర్తయింది. ఇక అంతా హ్యాపీ అనుకునే లోపు రంగారావుగారు హఠాత్తుగా చనిపోయారన్న వార్త ‘కొత్త కాపురం’ చిత్ర బృందాన్ని అతలాకుతలం చేసింది. చివరకు చేసేది ఏమి లేక, ఎస్వీయార్ ప్లేస్ లో గుమ్మడిని పెట్టుకుని ఆ సినిమా పూర్తి చేశారు.