
అది 1971 ఇండియా -పాకిస్తాన్ యుద్ధం. ఈ యుద్ధం గురించి మనకు ఏం తెలియదు. అందులో ఏం జరిగిందో..? ఎలా మొదలైందో.. అన్నీ పూసగుచ్చినట్టు చెప్పేందుకు బాలీవుడ్ లో రంగం సిద్ధమైంది. బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ ప్రధాన పాత్రలో నటించిన ‘భుజ్-ది ప్రైడ్ ఆఫ్ ఇండియా’ సినిమా కూడా ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. డిస్నీ+హాట్ స్టార్ ఫ్లాట్ ఫామ్ లో ఆగస్టు 13న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు.
తాజాగా ‘భుజ్’ చిత్రం ట్రైలర్ ను నిర్మాతలు విడుదల చేశారు. 1971లో జరిగిన భారత్-పాకిస్తాన్ మధ్య యుద్ధ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. అజయ్ దేవ్ గణ్ తోపాటు సంజయ్ దత్-సోనాక్షి సిన్హా, ప్రణీతా సుభాష్-షరద్ కేల్కర్-నోరా ఫతేహి-ఎమ్మీ విర్క్ ప్రధాన పాత్రలు పోషించారు. అభిషేక్ దుధయ్యా ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.
ఈ సినిమా ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటోంది. యుద్ధ సన్నివేశాలు-దేశభక్తి సంభాషణలు-అద్భుతమైన బ్యా గ్రౌండ్ స్కోర్ తో వచ్చిన ‘ఈ భూజ్’ ట్రైలర్ విశేషంగా ఆకట్టుకుంటోంది.
గుజరాత్ ప్రాంతంలోని భూజ్ ఎయిర్ పోర్టుపై పాకిస్తాన్ దాడి చేయడం.. అప్పటి ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ విజయ్ కార్నిక్ అక్కడి స్థానికుల సాయంతో ఎయిర్ పోర్టును పునర్నిర్మించి భారత సైన్యం వినియోగించేలా చేస్తారు. విజయ్ కార్నిక్ గా అజయ్ దేవ్ గణ్ నటించారు.చిరుత పులిని వేటాడిన శక్తివంతమైన సామాజికకార్యకర్తగా సోనాక్షి సిన్హా అద్భుతంగా నటించారు. సంజయ్ దత్ ఇక సహాయకారిగా మాట్లాడారు.
భారత్-పాకిస్తాన్ యుద్ధం 1971 జరిగి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆగస్టు 13న ఈ చిత్రాన్ని ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు.
