https://oktelugu.com/

Salman Khan: రాజమౌళి-సల్మాన్​ కాంబోలో సినిమా.. క్లారిటీ ఇచ్చిన బాలీవుడ్ స్టార్​ హీరో

Salman Khan: బాలీవుడ్​ స్టార్ హీరో, కండలవీరుడు సల్మాన్ ఖాన్ పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. కొన్ని సంవత్సరాలుగా బాలీవుడ్​ స్టార్​ హీరోల్లో ఒకరిగా కొనసాగుతున్న ఆయన..ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. కాగా, ఇటీవలే రాజమౌళి, సల్మాన్​ ఖాన్​ ఇద్దరూ ఎక్కువగా మీట్​ అయినట్లు తెలిసిన సంగతే. ఈ క్రమంలోనే వీరిద్దరి కాంబోలో సినిమా రానుందని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మరోవైపు […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 27, 2021 / 11:11 AM IST
    Follow us on

    Salman Khan: బాలీవుడ్​ స్టార్ హీరో, కండలవీరుడు సల్మాన్ ఖాన్ పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. కొన్ని సంవత్సరాలుగా బాలీవుడ్​ స్టార్​ హీరోల్లో ఒకరిగా కొనసాగుతున్న ఆయన..ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. కాగా, ఇటీవలే రాజమౌళి, సల్మాన్​ ఖాన్​ ఇద్దరూ ఎక్కువగా మీట్​ అయినట్లు తెలిసిన సంగతే.

    Salman Khan

    ఈ క్రమంలోనే వీరిద్దరి కాంబోలో సినిమా రానుందని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మరోవైపు ఆర్​ఆర్ఆర్​ ప్రీ రిలీజ్ ఈవెంట్​లోనూ ముఖ్య అతిథిగా సల్మాన్  రావడం, మరోవైపు సల్మాన్ హోస్ట్​గా ఉన్న బిగ్​బాస్​కి ఆర్​ఆర్​ఆర్​ హీరోలతో పాటు రాజమౌళి హాజరు కావడం తెలిసిందే. దీంతో, వీరిద్దరి కాంబోపై మరింత ఆసక్తి నెలకొంది. అయితే, సల్మాన్ ఖాన్​ పుట్టినరోజు సందర్భంగా మీడియాతో ముచ్చటిస్తూ.. రాజమౌళితో సినిమాపై క్లారిటీ ఇచ్చారు. అవన్నీ కేవలం ఊహాగానాలే అని కొట్టిపడేశారు. ప్రస్తుతం రాజమౌళితో కలిసి ఏ సినిమా తీయట్లేదని అన్నారు.

    Also Read: Pushpa Box Office Collection: ‘పుష్ప’  10 రోజుల ఏపీ  తెలంగాణ  కలెక్షన్స్  

    ఎంతో ప్రతిష్టాత్మకంగా డీవివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 7న విడుదలకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే వరుసగా ప్రమోషన్స్​లో ఫుల్ జోరు పెంచింది చిత్రబృందం. ఈ సినిమాలో తారక్​, రామ్​చరణ్ హీరోలుగా కనిపించనున్నారు. అలియా బట్​, ఒలివియా మోరిస్ హీరోయిన్లు. కాగా, కీరవాణి సంగీతం అందిస్తున్నారు. అజయ్​ దేవగణ్, శ్రియ, సముద్రఖని తదితరులు కీలక పాత్రలో కనిపించనున్నారు. ఎన్నో అంచనాల మధ్య వస్తోన్న ఈ సినిమా ఏ రేంజ్​లో రికార్డులను బద్దలు కొడుతుందో చూడాలి.

    Also Read: Naga Shaurya Lakshya: ప్చ్..  ‘ఆర్ఆర్ఆర్’కు  ప్లాప్ సినిమా  పోటీనా ?