Hyper Aadi: ఆమెను తల్లిని చేసిన హైపర్ ఆది… ఫోన్ బయటపెట్టిన సంచలన నిజం!

జబర్దస్త్ వేదికగా సంచలనాలు చేశాడు హైపర్ ఆది. అయితే కొన్నాళ్లుగా జబర్దస్త్ కి ఆయన దూరమయ్యాడు. శ్రీ దేవి డ్రామా కంపెనీ, ఢీ షో లో అలరిస్తున్నాడు. వచ్చే ఆదివారం హోలీ స్పెషల్ ఈవెంట్ నిర్వహించనున్నారు.

Written By: S Reddy, Updated On : March 18, 2024 3:10 pm

Hyper Aadi

Follow us on

Hyper Aadi: సుదీర్ఘ కాలంగా బుల్లితెర ప్రేక్షకులను తన కామెడీతో అలరిస్తున్నాడు హైపర్ ఆది. ఈ స్టార్ కమెడియన్ కి సంబంధించిన షాకింగ్ న్యూస్ ఒకటి వైరల్ గా మారింది. హైపర్ ఆది ఒకరిని తల్లిని చేశాడని తెలుస్తుంది. శ్రీ దేవి డ్రామా కంపెనీ షో లో ఈ విషయం బయటపడింది. దీంతో అంతా షాక్ అవుతున్నారు. అసలు పూర్తి వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

జబర్దస్త్ వేదికగా సంచలనాలు చేశాడు హైపర్ ఆది. అయితే కొన్నాళ్లుగా జబర్దస్త్ కి ఆయన దూరమయ్యాడు. శ్రీ దేవి డ్రామా కంపెనీ, ఢీ షో లో అలరిస్తున్నాడు. వచ్చే ఆదివారం హోలీ స్పెషల్ ఈవెంట్ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా రంగస్థలం మహేష్, డాన్సర్ పండు, బిగ్ బాస్ ఫేమ్ జెస్సి హాజరయ్యారు.

వీరి ముగ్గురి పై పంచులు వేస్తూ కడుపుబ్బా నవ్వించాడు ఆది. ఇక ఆ తర్వాత రష్మీ .. ఆది ఎలాంటి వాడో గూగుల్ ని అడిగి తెలుసుకుందాం అని అంటుంది. గూగుల్ ని హైపర్ ఆది ఎలాంటివాడు అని అడుగుతుంది. ‘నన్ను అందరూ గూగుల్ తల్లి అంటారు .. కానీ నన్ను తల్లిని చేసిందే వాడు’ అని చెప్తుంది. గూగుల్ తల్లినే తల్లిని చేశావా అని రష్మీ ఆదిని అడుగుతుంది. ఆ టైంలో నేను ఒక్కడితో తిరిగేవాడిని. మీవాడే వాడు. వాడి వల్లే ఇదంతా అంటూ ఆది ఇండైరెక్ట్ గా సుడిగాలి సుధీర్ ని ఇరికించాడు.

ఆ తర్వాత గూగుల్ తల్లిని ఇంద్రజ గురించి ఆది అడుగుతాడు. ఆమె ఇప్పుడే ఇలా ఉన్నారంటే .. ఆ వయసులో చించేసి ఉంటారు అని చెప్తుంది. దీంతో అందరూ తెగ నవ్వేస్తారు. శ్రీదేవి డ్రామా కంపెనీ లేటెస్ట్ ప్రోమో ఎంటర్టైనింగ్ గా ఉంది. ఆది పై గూగుల్ తల్లి కామెడీ బాగా వర్కౌట్ అయ్యింది. ప్రస్తుతం ఈ ప్రోమో నెట్టింట వైరల్ అవుతుంది. అదన్న మాట మేటర్. నిజంగా ఆది ఎవరినీ తల్లిని చేయలేదు.