https://oktelugu.com/

Priya Prakash Varrier: ప్చ్ క్రేజీ బ్యూటీ… అంతా పడిపోయాక తత్వం బోధపడితే ఎలా ?

Priya Prakash Varrier: ‘ప్రియా ప్రకాష్ వారియర్’ అనే పేరు వినగానే ఓవర్ నైట్ లో స్టార్ అయిపోయింది అని ప్రేక్షకులు కూడా బలంగా అభిప్రాయపడ్డారు. ఒక్క చిన్న వీడియోతో ఫుల్ ఫాలోయింగ్ తెచ్చుకుంది తప్ప, కష్టంతో ఎదిగిన హీరోయిన్ కాదు అని మేకర్స్ కూడా ఆమె పట్ల కాస్త దురుసుగానే ఉన్నారు. దానికి కారణం ఆమె ఎలా ఎదిగింది అని కాదు, ఆమె ఎంత అడిగింది అని. అవును, ఈ యంగ్ మలయాళ బ్యూటీ గత […]

Written By:
  • Shiva
  • , Updated On : December 18, 2021 / 03:43 PM IST
    Follow us on

    Priya Prakash Varrier: ‘ప్రియా ప్రకాష్ వారియర్’ అనే పేరు వినగానే ఓవర్ నైట్ లో స్టార్ అయిపోయింది అని ప్రేక్షకులు కూడా బలంగా అభిప్రాయపడ్డారు. ఒక్క చిన్న వీడియోతో ఫుల్ ఫాలోయింగ్ తెచ్చుకుంది తప్ప, కష్టంతో ఎదిగిన హీరోయిన్ కాదు అని మేకర్స్ కూడా ఆమె పట్ల కాస్త దురుసుగానే ఉన్నారు. దానికి కారణం ఆమె ఎలా ఎదిగింది అని కాదు, ఆమె ఎంత అడిగింది అని. అవును, ఈ యంగ్ మలయాళ బ్యూటీ గత ఏడాది వరకూ ఎక్కువ రెమ్యునరేషన్ అడిగేది.

    Priya Prakash Varrier

    దానికి తగ్గట్టుగానే ‘ప్రియా ప్రకాష్ వారియర్’ స్టార్ హీరోయిన్ అవుతుందని అంచనా వేశారు. దానికి ముఖ్య కారణం.. ఆమెకు నేషనల్ వైడ్ గా ఫుల్ పాపులారిటీ వచ్చింది. ఆ స్టార్ డమ్ చూసుకునే ఎక్కువ రెమ్యునరేషన్ కోసం ఆశ పడింది. ఆ ఆశలో సరిగ్గా కెరీర్ ను ప్లాన్ చేసుకోలేకపోయింది. చివరకు అమ్మడుకు అవకాశాలు కూడా కరువయ్యాయి.

    ప్రియా పరిస్థితి ప్రస్తుతం బాగాలేదు. అంతా పడిపోయాక తత్వం బోధపడింది అన్నట్టు… ఇప్పుడు ఆమెలో మార్పు వచ్చింది. తనది బలుపు కాదు, వాపు అని అర్థం చేసుకుంది. అందుకే, ఛాన్స్ ల కోసం ప్రస్తుతం తెగ తిరుగుతుంది. గత నెల నుంచి తెలుగు ఇండస్ట్రీలోని అఫీస్ ల చుట్టూ రౌండ్స్ వేస్తోంది. మొదట్లో వచ్చిన ఆఫర్స్ ను సరిగ్గా వాడుకోలేదు.

    అలాగే తనకు వచ్చిన స్టార్ డమ్ ను మెయింటైన్ చేయడంలో కూడా ప్రియా పూర్తిగా విఫలం అయింది. ప్రస్తుతానికి అయితే, హైదరాబాద్ లోనే మకాం పెట్టేసింది. కొన్ని పెద్ద ప్రొడక్షన్ హౌస్ లకు రెగ్యులర్ గా వెళ్తుంది. రెమ్యునరేషన్ గొడవే లేదు. ఎంత ఇచ్చినా ఓకే అంటూ అవకాశాలను అడుగుతుంది. అయితే ఇక్కడ ఒక సమస్య ఉంది.

    Also Read: ఆ గొప్ప నటి ఆనందంలోనూ దిగులుగానే క‌నిపించేవారు !

    ఈ యంగ్ బ్యూటీ ఇప్పటి వరకు ఎక్కువగా సెకెండ్ హీరోయిన్ పాత్రలనే చేస్తూ వచ్చింది. ఇప్పుడు వస్తోన్న పాత్రలు కూడా ఎక్కువగా సెకెండ్ హీరోయిన్ పాత్రలే. కాబట్టి, మనం మెయిన్ హీరోయిన్ పాత్రలను ఇవ్వలేం అంటూ మన దర్శక నిర్మాతలు బావిస్తున్నారట. మొత్తానికి సెకండ్ హీరోయిన్ గానే ప్రియా కెరీర్ ఎండ్ అయ్యేలా ఉంది.

    Also Read: Shruti Haasan: బాలయ్య కోసం లుక్ మార్చబోతున్న శ్రుతి హాసన్ !

    Tags