Ram Charan
Ram Charan : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Global Star Ramcharan) ‘గేమ్ చేంజర్'(Game Changer) లాంటి భారీ డిజాస్టర్ ఫ్లాప్ తర్వాత బుచ్చి బాబు తో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రెగ్యులర్ షూటింగ్ ఇటీవలే మొదలుపెట్టుకొని రెండు షెడ్యూల్స్ ని కూడా పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి ప్రస్తుతం బ్రేక్ పడింది. మూడవ షెడ్యూల్ వచ్చే వారం నుండి మొదలు కానుంది. ఈ మూడవ షెడ్యూల్ లో తారాగణం కోసం బుచ్చి బాబు(Buchi babu Sana) కసరత్తులు చేస్తున్నట్టు సమాచారం. కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ ఈ చిత్రంలో ఒక కీలక పాత్ర పోషించబోతున్నాడు. డేట్స్ అయితే ఆయన చాలా కాలం క్రితమే ఇచ్చేశాడు కానీ, మధ్యలో అత్యవసర చికిత్స ఉండడంతో ఆ డేట్స్ రద్దు చేసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఫ్రెష్ గా ఆయన మళ్ళీ డేట్స్ ఇచ్చాడట. మూడవ షెడ్యూల్ లో ఆయన పాల్గొనబోతున్నట్టు సమాచారం.
అదే విధంగా ఈ సినిమాలో హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్(Pragya Jaiswal) ఒక కీలక పాత్ర పోషిస్తున్నట్టు సమాచారం. ఆమె కూడా మూడవ షెడ్యూల్ లో పాల్గొనబోతుందట. అయితే ప్రగ్యా జైస్వాల్ ప్రస్తుతం మార్కెట్ లో లేని హీరోయిన్. ఆమెని ఇప్పుడు మీడియం రేంజ్ హీరోలు కూడా తీసుకోవడం లేదు. కేవలం బాలయ్య(Nandamuri Balakrishna) మాత్రమే ఆమెని ప్రోత్సహిస్తూ వస్తున్నాడు. ‘అఖండ’ చిత్రంలో హీరోయిన్ గా నటించిన ప్రగ్యా, రీసెంట్ గా విడుదలైన ‘డాకు మహారాజ్'(Daku Maharaj) చిత్రంలో కూడా నటించింది. రేపు రాబోయే ‘అఖండ 2’ లో కూడా ఆమె కీలక పాత్ర పోషించబోతుంది. బాలయ్య కి అయితే ప్రగ్యా జైస్వాల్ బాగానే ఉంటుంది కానీ, రామ్ చరణ్ పక్కన సరిపోదని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కానీ ప్రగ్యా జైస్వాల్ ఈ చిత్రంలో కేవలం ఒక కీలక పాత్ర మాత్రమే పోషిస్తుంది కానీ, జాన్వీ కపూర్ తో సమానమైన పాత్ర మాత్రం కాదని అంటున్నారు.
వాస్తవానికి ఈ క్యారక్టర్ కోసం ముందుగా అనసూయ ని తీసుకుందాం అనుకున్నారట. కానీ రంగస్థలం కాంబినేషన్ ని మళ్ళీ చూసినట్టుగా అనిపిస్తుందని, ఆడియన్స్ లో ఫ్రెష్ ఫీల్డ్ ఉండదనే ఉద్దేశ్యంతో ప్రగ్యా జైస్వాల్ ని తీసుకున్నారట. ఆమె క్యారక్టర్ చాలా పవర్ ఫుల్ గా ఉండబోతున్నట్టు సమాచారం. అనసూయ క్యారక్టర్ ఈమె చేస్తుందంటే, కచ్చితంగా నెగటివ్ షేడ్ రోల్ అయ్యి ఉంటుందని అంటున్నారు అభిమానులు. ఇకపోతే ఈ సినిమాకి AR రెహమాన్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసి, ఈ ఏడాది అక్టోబర్ 16న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారట మేకర్స్. ‘గేమ్ చేంజర్’ ఫలితంతో తీవ్రమైన నిరాశ మూడ్ లోకి వెళ్లిపోయిన రామ్ చరణ్ అభిమానులు, ఈ చిత్రం పైనే ఆశలన్నీ పెట్టుకున్నారు. ఈ సినిమాతో చరణ్ భారీ కం బ్యాక్ ఇవ్వాలని కోరుకుంటున్నారు