Chhaava
Chhaava : విక్కీ కౌశల్(Vikcy Kaushal), రష్మిక(Rashmika Mandana) కాంబినేషన్ లో తెరకెక్కిన ‘చావా'(Chhaava Movie) చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిల్చిందో మన అందరికీ తెలిసిందే. చరిత్రలో కనుమరుగు అయిపోయిన ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు ఛత్రపతి శంభాజీ మహారాజ్ వీరోచిత పోరాటాన్ని ఆదర్శంగా తీసుకొని ఈ చిత్రాన్ని ఎంతో అద్భుతంగా తీర్చి దిద్దాడు డైరెక్టర్ లక్ష్మణ్. ఆయన అద్భుతమైన దర్శకత్వ ప్రతిభ కారణంగానే ఈ సినిమా ఎవ్వరూ ఊహించని రీతిలో సక్సెస్ అయ్యింది. అయితే ఈ చిత్రానికి నార్త్ ఇండియా లో కేవలం మహారాష్ట్ర నుండి మాత్రమే ఆల్ టైం బ్లాక్ బస్టర్ అనే రేంజ్ వసూళ్లు వస్తున్నాయి. ఎందుకంటే మహారాష్ట్ర గడ్డ మీదనే శివాజీ, ఆయన తనయుడు శంభాజీ పుట్టింది. మరాఠీయుల కోసమే వాళ్ళు వీరోచితంగా పోరాడి ప్రాణాలను వదిలింది. అందుకే అక్కడి జనాలు వాళ్ళిద్దరి దేవుళ్ళు లెక్క కొలుస్తారు.
తాము దైవంగా భావించే ఆ ఇద్దరి యోధుల గురించి వచ్చిన సినిమాలన్నిటికీ వాళ్ళు ఈ స్థాయి వసూళ్లను తెచ్చి పెట్టారు. గతంలో అజయ్ దేవగన్ హీరోగా నటించిన ‘తానాజీ’ చిత్రం కూడా ఈ బ్యాక్ డ్రాప్ లో వచ్చినదే. ఇప్పుడు ‘చావా’ కి కూడా ఆ ప్రాంతం లో ఆల్ టైం మెగా బ్లాక్ బస్టర్ రేంజ్ వసూళ్లు రావడానికి కూడా కారణం అదేనని అంటున్నారు బాలీవుడ్ ట్రేడ్ పండితులు. కానీ నార్త్ ఇండియా లో మిగిలిన రాష్ట్రాల్లో కేవలం సూపర్ హిట్ రేంజ్ వసూళ్లు మాత్రమే వస్తున్నాయి కానీ, ఆల్ టైం మెగా బ్లాక్ బస్టర్ రేంజ్ వసూళ్లు మాత్రం రావడం లేదు. విడుదల రోజు బాలీవుడ్ లో అనేకమంది ప్రముఖులు కచ్చితంగా ఈ చిత్రం పుష్ప 2 గ్రాస్ వసూళ్లను దాటేస్తుందని ఛాలెంజ్ చేసారు. కానీ మొదటి వారం పూర్తి అయ్యేసరికి పుష్ప 2 లో సగం కూడా రాకపోవడం గమనార్హం.
‘పుష్ప 2′(Pushpa 2 Movie) చిత్రానికి మొదటి వారంలో దాదాపుగా 1200 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. కానీ ‘చావా’ చిత్రానికి మొదటి వారం ఇండియా వైడ్ గా 225 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లు వచ్చాయి. 7వ రోజు దాదాపుగా 22 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లు వచ్చినట్టు చెప్తున్నారు ట్రేడ్ పండితులు. ఓవరాల్ గా గ్రాస్ పరంగా చూసుకుంటే ఇండియా వైడ్ గా 250 కోట్ల రూపాయిలు, అదే విధంగా వరల్డ్ వైడ్ గా ఓవర్సీస్, మరియు సౌత్ ఇండియన్ మర్కెట్స్ కలుపుకొని 350 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయని అంటున్నారు. విక్కీ కౌశల్ కి, బాలీవుడ్ మార్కెట్ కి ఇది చాలా మంచి వసూళ్లే కానీ, పుష్ప 2 తో పోలుస్తున్నారు కాబట్టి, ఆ సినిమాతో పోలిస్తే చావా చిత్రానికి నాల్గవ వంతు వసూళ్లు కూడా రాలేదని చెప్పొచ్చు.