Heroine Regina Cassandra: మగాళ్ల లైంగిక సామర్థ్యం పై హీరోయిన్ రెజీనా కాసాండ్రా సెన్సేషనల్ కామెంట్ చేశారు. అబ్బాయిలు మ్యాగీ నూడుల్స్ లెక్క రెండు నిమిషాల్లో అవుట్ అయిపోతారంటూ షాకింగ్ కామెంట్ చేసింది. రెజీనా డబుల్ మీనింగ్ జోక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సుధీర్ వర్మ దర్శకత్వంలో రెజీనా కాసాండ్రా, నివేదా థామస్ హీరోయిన్స్ గా శాకిని డాకిని టైటిల్ తో మూవీ తెరకెక్కింది. ఈ మూవీ సెప్టెంబర్ 16న విడుదల కానుంది. ఈ క్రమంలో హీరోయిన్స్ ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు.
వినూత్నంగా రెజీనా, నివేదాలకు బిర్యానీ తినిపిస్తూ ఓ యాంకర్ ఇంటర్వ్యూ చేశాడు.ఈ ఇంటర్వ్యూలో అమ్మాయిల ఆధిపత్యం గురించి మాట్లాడే క్రమంలో రెజీనా డబుల్ మీనింగ్ జోక్ వేసింది. నిజానికి అది సింగిల్ మీనింగ్ డైరెక్ట్ స్టేట్మెంట్ అని కూడా చెప్పొచ్చు. రెజీనా మాట్లాడుతూ… అబ్బాయిలపై ఒక జోక్ ఉంది. అది ఇప్పుడు చెబితే బాగోదు అన్నారు. అయితే ఆ మాటకు కట్టుబడకుండా ఆ జోక్ చెప్పేసింది.
”అబ్బాయిలు మ్యాగీ నూడుల్స్ రెండూ ఒకటే రెండు నిమిషాల్లో అయిపోతారు” అన్నారు. ఈ అడల్ట్ జోక్ ఓ క్షణం పాటు యాంకర్ కి అర్థం కాలేదు. అది గమనించిన రెజీనా, నా జోక్ నీకు అర్ధమైనట్లు లేదంది. తర్వాత ఆ జోక్ డీప్ మీనింగ్ అర్థం చేసుకున్న యాంకర్.. నాకు అర్థమైందని తల పట్టుకున్నాడు. దీని గురించి ఇప్పుడు డిస్కషన్ వద్దని ఆమెతో చెప్పాడు. అంత వల్గర్ జోక్ గురించి మాట్లాడటానికి యాంకర్ ఇష్టపడలేదు. ఇక పక్కనే ఉండి హాయిగా బిర్యానీ తింటున్న నివేదా చిన్నగా నవ్వుకొని వదిలేసింది.
అబ్బాయిల లైంగిక సామర్థ్యం పై రెజీనా వేసిన ఆ జోక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంత పచ్చి జోక్ ఎలా వేస్తుందని అందరూ వాపోతున్నారు. రెజీనా జోక్ సినిమాకు మంచి ప్రచారం తెచ్చిపెట్టింది. శాకిని డాకిని చిత్రానికి సుధీర్ వర్మ దర్శకుడు కాగా… సురేష్ బాబు నిర్మించారు. మిక్కీ జె మేయర్ సంగీతం అందించారు. ఇక తెలుగులో ఫేడ్ అవుట్ అయిన రెజీనా ఇటీవల ఆచార్య మూవీలో ఐటెం భామగా మెరిశారు. చిరంజీవితో పాటు ‘సానా కష్టం’ సాంగ్ లో మాస్ స్టెప్స్ తో అలరించారు.