https://oktelugu.com/

హ్యాపీగాపెళ్లి చేసుకునే లోపే బాధ పెట్టారు !

మెగాస్టార్ మలయాళ ‘లూసిఫర్‘ తెలుగు రీమేక్ గురించి రోజుకొక వార్త పుట్టుకొస్తోంది. వాస్తవానికి ఇంతవరకూ మెగాస్టార్ కి కూడా ఈ సినిమా విషయంలో ఏమి చేస్తున్నాడో అధికారికంగా అప్ డేట్ ఇవ్వలేదు. నిజమే.. దర్శకుడు వినాయక్ అంటే.. మెగాస్టార్ కి సాఫ్ట్ కార్నర్. పైగా వినాయక్ ఇప్పుడు కష్టాల్లో ఉన్నాడు. ఏ స్టార్ హీరో పిలిచి ఛాన్స్ ఇచ్చే స్థితిలో వినాయక్ లేడు. నిజానికి వినాయక్ సినిమాలు లేక యాక్టర్ గా మారుతున్నాడు. ఇలాంటి పరిస్తితుల్లో మెగాస్టార్ […]

Written By:
  • admin
  • , Updated On : August 5, 2020 / 05:23 PM IST
    Follow us on


    మెగాస్టార్ మలయాళ ‘లూసిఫర్‘ తెలుగు రీమేక్ గురించి రోజుకొక వార్త పుట్టుకొస్తోంది. వాస్తవానికి ఇంతవరకూ మెగాస్టార్ కి కూడా ఈ సినిమా విషయంలో ఏమి చేస్తున్నాడో అధికారికంగా అప్ డేట్ ఇవ్వలేదు. నిజమే.. దర్శకుడు వినాయక్ అంటే.. మెగాస్టార్ కి సాఫ్ట్ కార్నర్. పైగా వినాయక్ ఇప్పుడు కష్టాల్లో ఉన్నాడు. ఏ స్టార్ హీరో పిలిచి ఛాన్స్ ఇచ్చే స్థితిలో వినాయక్ లేడు. నిజానికి వినాయక్ సినిమాలు లేక యాక్టర్ గా మారుతున్నాడు. ఇలాంటి పరిస్తితుల్లో మెగాస్టార్ పిలిచి మరీ వినాయక్ కి లూసిఫర్ అవకాశం ఇచ్చారని గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో అనేక రకాలుగా గాసిప్ రాయుళ్లు రాసి పడేస్తున్నారు.

    Also Read:  ఖాకీ కాదు ఖద్దరు వేయనున్న పవన్‌!

    పాపం మెగాస్టార్ తో సినిమాని ఓకే చేయించుకుని, శుభమా అని పెళ్లి చేసుకుని ఆనంద పడేలోపే డైరెక్టర్ సుజీత్ కి ఈ న్యూస్ పెద్ద చికాకు పెట్టించిందట. తానూ చేస్తోన్న ‘లూసిఫర్’ సినిమాను వినాయక్ చేతిలో పెట్టారని వార్తలు రావడంతో సుజీత్ బాగానే ఫీల్ అయ్యాడట. హ్యాపీగా పెళ్లి చేసుకునే లోపే బాధ పెట్టారు అన్నమాట. అసలు ఇంతకీ ఈ వార్త గురించి ఫిల్మ్ సర్కిల్స్‌ లో వినిపిస్తోన్న లేటెస్ట్ అప్ డేట్ ఏమిటంటే, వినాయక్ కి మెగాస్టార్ ఇంకా ఈ సినిమా ఛాన్స్ ఇవ్వలేదు. కథ ఉంటే చెప్పు అని మాత్రమే వినాయక్ ని చిరు కోరారు. అది కూడా మరో ఏడాది తరువాతే. ఈ లోపు స్క్రిప్ట్ రెడీ చేసుకో అనే సెన్స్ లో మెగాస్టార్ వినాయక్ కి ఓ భరోసా ఇచ్చారు. ఆయితే ఈ వార్త అలా అలా చేరి లూసిఫర్ సినిమాకి వినాయక్ ను డైరెక్టర్ ను చేసే స్థాయికి వెళ్ళింది.

    Also Read: చైతు ‘లవ్ స్టోరీ’కి కొత్త కష్టం !

    అయినా లూసిఫర్ మలయాళంలో సూపర్ హిట్ అయింది. అంతమాత్రాన మెగాస్టార్ చిరంజీవి చేయాల్సిన మూవీనా అంటే కాదనే చెప్పాలి. మొదట ఈ సినిమాకి డైరెక్షన్ చేయమని సుజీత్ ని అడిగినప్పుడు అతను చెప్పిన మాట కూడా ఇదేనట. మీ స్థాయి సినిమా కాదు ఇది, మీ కోసం నేను ఒక కథ రాస్తాను అని ఒక లైన్ కూడా చెప్పాడట. కానీ సాహో ప్లాప్ కి సుజీత్ ను పూర్తిగా నమ్మలేక.. లేదు లూసిఫర్ మూవీనే చేద్దామని మెగాస్టార్ చెప్పాడట. ఇక తెలుగు ఆడియన్స్ కోరుకునే ఎమోషన్స్ కి తగ్గట్టుగా లూసిఫర్ స్క్రిప్ట్‌లో డైరెక్టర్ కొన్ని కీలకమైన మార్పులను చేసాడు.