NTR- Balakrishna: నందమూరి ఫ్యామిలీలో విభేదాలున్నాయన్నది నిజం. జూనియర్ ఎన్టీఆర్ ఒకవైపు బాలయ్యతో పాటు మిగతా కుటుంబ సభ్యులు మరొకవైపు ఉన్నారు. ఈ విబేధాలకు పొలిటికల్ పరిణామాలు కారణమయ్యాయి. ఎన్టీఆర్ నాన్న హరికృష్ణను టీడీపీలో చంద్రబాబు ఎదగనీయలేదు. ఒక దశలో టీడీపీకి పోటీగా హరికృష్ణ కొత్త పొలిటికల్ పార్టీ కూడా పెట్టారు. అది సక్సెస్ కాలేదు. హరికృష్ణ మరణించే వరకు కూడా ఆయనకు సరైన ప్రాతినిధ్యం లభించలేదు. కొడుకు ఎన్టీఆర్ ని 2009 ఎన్నికల కోసం వాడుకున్నారు. తర్వాత దూరం పెట్టారు.
ఎన్టీఆర్ టీడీపీకి దూరమై దశాబ్దం దాటిపోతుంది. ఆయన ఎలాంటి పొలిటికల్ ఈవెంట్స్ లో పాల్గొనడం లేదు. ఇక టీడీపీ పార్టీలో ఎన్టీఆర్ వర్గం ఒకటి తయారైంది. వాళ్ళు నారా చంద్రబాబు, బాలయ్యలకు చుక్కలు చూపిస్తున్నారు. టీడీపీ సభల్లో ఎన్టీఆర్ జెండాలు చూపుతూ సీఎం నినాదాలు చేస్తుంటారు. టీడీపీ అధినేత ఎప్పటికైనా ఎన్టీఆరే అంటారు. లోకేష్ నాయకత్వాన్ని వారు వ్యతిరేకిస్తున్నారు.
కాగా టీడీపీ పార్టీ ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు భారీగా నిర్వహిస్తుంది. మరో ఏడాదిలో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో జనాలకు ఎన్టీఆర్ ని గుర్తు చేసి లబ్ది పొందాలనేది వారి ప్రయత్నం. ఈ క్రమంలో విజయవాడ వేదికగా ఉత్సవాలు జరిపారు. నేడు హైదరాబాద్ లో మరో సభకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. టాలీవుడ్ టాప్ స్టార్స్ అందరినీ ఆహ్వానిస్తున్నట్లు ప్రకటనలు విడుదల చేశారు. జూనియర్ ఎన్టీఆర్ ని టీడీ జనార్దన్ ప్రత్యేకంగా నివాసానికి వెళ్లి ఆహ్వానించారు.
అయితే ఎన్టీఆర్ మాత్రం రాలేనంటూ చివరి నిమిషంలో హ్యాండ్ ఇచ్చాడు. బాలయ్య, చంద్రబాబు మీద కోపంతోనే ఎన్టీఆర్ తాతయ్య శతజయంతి వేడుకలకు హాజరుకాలేదని టాలీవుడ్ వర్గాల వాదన. ఎందుకంటే ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు పేరున టీడీపీ పొలిటికల్ ఈవెంట్స్ నిర్వహిస్తుంది. అక్కడ జరిగేవన్నీ రాజకీయ ప్రసంగాలే. బాబు, బాలయ్య నాయకత్వంలో ఉన్న టీడీపీకి తన మద్దతు తెలపడం ఇష్టం లేకే ఎన్టీఆర్ డుమ్మా కొట్టాడని అంటున్నారు. నేడు ఎన్టీఆర్ బర్త్ డే కాగా ముందుగా అనుకున్న ఫ్యామిలీ ఈవెంట్స్ ఉన్నాయి. అందుకే రాలేకపోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇది టీడీపీ శ్రేణుల్లో అసంతృప్తి కారణమైంది. ఎన్టీఆర్ పై విమర్శల దాడి జరిగే సూచనలు కలవు.